
మంచు విష్ణు కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఈ మధ్య సినిమాలేవీ కలిసి రాకపోవడంతో.. కొంత గ్యాప్ తీసుకున్న హీరో.. సరికొత్త క్యారెక్టరైజేషన్ తో పలకరించబోతున్నాడు.
టాలీవుడ్ స్టార్ టెక్నీషియన్స్ కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ తో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి వెల్లడించారు మంచు విష్ణు. ఈసినిమాకు స్టార్ రైటర్ కోనా వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.
జి.నాగేశ్వరరెడ్డి స్ర్కిఫ్ట్ అందించిన ఈ సినిమాలో తను చేస్తున్న గాలి నాగేశ్వరరావు క్యారెక్టర్ గురించి మంచు విష్ణు రివిల్ చేవారు. ఈ సినిమాలో తన గెటప్ కు సంబంధించిన పిక్ ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు మంచు విష్ణు. ఇప్పటివరకూ తను టచ్ చేయని డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు మంచు విష్ణు.ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను యూనిక్యూ ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా వెల్లడించడానికి ప్లాన్ చేస్తోంది చిత్రం యూనిట్.
కాగా మంచు ఫ్యామీలీ ఈ మధ్య వరుస వివాదాల మధ్య నలుగుతుంది. ఇండస్ట్రీ సమస్యలపై మెగా-మంచు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఈ మధ్య రిలీజ్ అయిన మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా మూవీ డిజాస్టర్ కావడంతో మంచు ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది. అంతే కాదు వీరిపై వరుసగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటంతో వారిపై 10 కోట్లకు పరువునష్టం దావా వేస్తానంటూ మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చారు.