F3 Promotions: ఎఫ్3 సెట్ లో కోబ్రోస్ తో నాగరత్తమ్మ హడావిడి... హడలిపోయిన వెంకీ, వరుణ్ తేజ్...

Published : Mar 04, 2022, 09:04 PM IST
F3 Promotions: ఎఫ్3 సెట్ లో కోబ్రోస్ తో నాగరత్తమ్మ హడావిడి... హడలిపోయిన వెంకీ, వరుణ్ తేజ్...

సారాంశం

విక్టరీ  వెంక‌టేశ్, మెగా ప్రిన్స్  వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో తెరకెక్కుతోన్న సినిమా ఎఫ్3. ఎ2 మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తన్నారు టీమ్    

విక్టరీ  వెంక‌టేశ్, మెగా ప్రిన్స్  వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్ లో తెరకెక్కుతోన్న సినిమా ఎఫ్3. ఎ2 మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తన్నారు టీమ్  

వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ‌రీన్ కౌర్  హీరోయి లు గా నటిస్తున్న సినిమా ఎఫ్3. యంగ్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్  అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈమూవీ సమ్మ‌ర్ కానుక‌గా మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎప్పుడూ కొత్తగా ఆలోచించే అనిల్ రావిపూడి.. ఈ సినిమా ప్రమోషన్లను కూడా సరికొత్తగా ప్లాన్ చేశాడు. 

ప్రాంఛైజీ ఫ్యాన్ ర‌త్త‌మ్మ‌తో క‌లిసి స‌రికొత్త‌గా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టాడు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిన టీమ్ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. నాగ‌ర‌త్త‌మ్మ ఎఫ్ 3 సెట్స్ లోకి ప్ర‌వేశించి నానా ర‌భస సృష్టించింది. 

అనిల్ రావిపూడి తో మొదలు పెట్టి.. ఆతరువాత హీరోలు వ‌రుణ్‌, వెంకీలతో ఫన్నీ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఎఫ్ 2 కంటే లేటెస్ట్ గా.. ప్రమోషన్లు చేయడానికి తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పుకొచ్చింది.  ఫ్ర‌స్టేష‌న్ త‌గ్గించుకోవ‌డానికి ఎఫ్ 3లో ఎలాంటి సీన్లు ఉండ‌బోతున్నాయ‌ని  ఇద్దరు హీరోలను అడిగి తెలుసుకుంది నాగ‌ర‌త్త‌మ్మ‌. 

 

అంతే కాదు మూవీ షూటింట్ సెట్స్ లో కో ఆర్టిస్ట్ లు అయిన  శ్రీనివాస్ రెడ్డి, అన్న‌పూర్ణ‌మ్మ‌, ప్ర‌గ‌తి, రాజేంద్ర‌ప్ర‌సాద్ లాంటి స్టార్ సీనియర్  న‌టీన‌టుల‌తో ఫ‌న్నీ ఫన్నీగా పంచులు వేసుకుంటూ చిన్న చిన్న ఇంటర్వ్యూలు కూడా చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హడావిడి చేస్తుంది. 

ఎఫ్3 లో వీరితో పాటు అంజ‌లి, సునీల్ కీ రోల్స్ చేస్తున్నారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్  దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈసారి ఎఫ్2 ను మించిన ఫన్ తో పాటు ఫ్రస్టేషన్ ను కూడా చూపించబోతున్నట్టు డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?