ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి సినిమా సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలుస్తుంది. తాజాగా ప్రభాస్, రణ్‌వీర్ సింగ్ స్పందించారు. పాక్‌కి వార్నింగ్ ఇచ్చారు.
ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రంగా మారుతుంది. పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ సైతం అన్ని రకాలుగా రంగంలోకి దిగుతుంది. యుద్ధ తీవ్రతని పెంచబోతుంది.
భారత్ సైన్యానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సినిమా సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. సినిమా రంగం నుంచి విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ తమ విరాళాన్ని ప్రకటించారు. నాని క్రేజీ కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో భారత్ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు. ఇండియన్ ఆర్మీని ప్రశంసిస్తూ కామెంట్ చేశారు. భారత్ ఎప్పుడూ పై స్థాయిలో ఉంటుందన్నారు. డార్లింగ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
`ఇండియా స్టాండ్స్ టాల్`(భారత్ ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటుంది) అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా `ఆపరేషన్ సిందూర్` యాష్ ట్యాగ్‌ని పంచుకున్నారు. ప్రస్తుతం డార్లింగ్ పోస్ట్ వైరల్.
దీనిపై మరో స్టార్ హీరో సైతం స్పందించారు. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పాక్ కి వార్నింగ్ ఇచ్చారు. తమ పని తాము చేసుకుపోయే వారిని మేం డిస్టర్బ్ చేయం.
కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనిచూస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు` అంటూ వార్నింగ్ నోట్‌ని పంచుకున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు భారత్‌కి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరు సూపర్ స్టార్ల స్పందన మరింత ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది.
ప్రభాస్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాల లైనప్‌లో ఉన్నారు. `ది రాజా సాబ్` షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో ఇది ఆడియెన్స్ ముందుకు రానుంది. దీంతోపాటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు.
ఆ తర్వాత `స్పిరిట్` మూవీని ప్రారంభించనున్నారు. అలాగే ప్రశాంత్ వర్మతో ఓ మూవీ చేయాల్సి ఉంది. `సలార్ 2`, `కల్కి 2` చిత్రాల్లో నటించాల్సి ఉంది ప్రభాస్.