దుబాయ్ లోని‌ ఆ లోకేషన్‌లో అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అంటోన్న మహేష్‌

Published : Feb 04, 2021, 06:42 PM ISTUpdated : Feb 04, 2021, 06:44 PM IST
దుబాయ్ లోని‌ ఆ లోకేషన్‌లో అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అంటోన్న మహేష్‌

సారాంశం

మహేష్‌బాబు నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రం దుబాయ్‌లోని `ఇన్‌5దుబాయ్‌` అనే బిజినెస్‌ సర్వీస్‌ సెంటర్‌లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. ఆ లొకేషన్‌ ఫోటోలను పంచుకున్నారు మహేష్. అద్భుతమైన అనుభవంలా ఉందన్నారు.

మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం `సర్కారు వారి పాట` దుబాయ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. దుబాయ్‌లోని `ఇన్‌5దుబాయ్‌` అనే బిజినెస్‌ సర్వీస్‌ సెంటర్‌లో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది.

ఆ లొకేషన్‌ ఫోటోలను పంచుకున్నారు మహేష్. అద్భుతమైన అనుభవంలా ఉందన్నారు. `సర్కారువారి పాట` షూటింగ్‌ `ఇన్‌5దుబాయ్‌`లో అమేజింగ్‌ ఎక్స్ పీరియెన్స్. వారి ఆలోచనలను రియాలిటీగా మార్చడం ద్వారా ఔత్సామిక పారిశ్రామిక వేత్తలకు, స్టార్టప్‌లకు ఉపయోగపడేలా, వారికి కావాల్సిన విధంగా ఇది రూపుదిద్దుకుంది. ఆత్మీయ స్వాగతానికి అభినందిస్తున్నా. గుడ్‌ లక్‌` అని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా మహేష్‌ `ఇన్‌5దుబాయ్‌` బిల్డింగ్‌ని, అందులోని లోపల భాగాన్ని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరోవైపు సెట్‌లో మహేష్‌కి పరశురామ్‌ గొడుగు పట్టుకున్నట్టు ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ సెట్‌కి వెళ్లిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌.. మహేష్‌ బ్యాక్ సైడ్‌ నుంచి క్లోజ్‌లో తీసిన ఓ ఫోటోని పంచుకున్నారు. మహేష్‌ లుక్‌ రివీల్‌ కాకుండా తీసిన ఆ ఫోటో సైతం వైరల్‌ అయ్యింది. ఇక దాదాపు 20 రోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతుందని, అనంతరం హైదరాబాద్‌కి వచ్చి, ఆర్‌ఎఫ్‌సీలో చిత్రీకరిస్తారని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు