బాహుబ‌లి2 త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాకు మరింత ఆలస్యం

Published : Jan 05, 2017, 04:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
బాహుబ‌లి2 త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాకు మరింత ఆలస్యం

సారాంశం

బ‌హూబ‌లి2 సినిమాతో త్వ‌ర‌లోనే  ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ప్ర‌భాస్ తరువాత సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న మూవీలో న‌టిస్తున్న‌రెబ‌ల్ స్టార్ ఇప్ప‌టికే ర‌న్ రాజా ర‌న్ మూవీతో స‌క్సెస్ ని ద‌క్కించుకున్న సుజీత్ 

 

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. యు.వి.క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎమీజాక్స‌న్ పేరును హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా శంక‌ర్, ఎషాన్‌, లాయ్ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్‌లో ప్ర‌భాస్ ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. 

ఇప్పుడు ప్ర‌భాస్ త‌న త‌దుపరి చిత్రాన్ని కూడా ఆ రేంజ్‌లోనే భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు నూట యాబై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీల్లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జ‌న‌వ‌రిలో కానీ, ఫిభ్ర‌వ‌రిలో కానీ విడుద‌ల చేయాల‌నుకున్నారు. తీరా ఇప్పుడు సినిమా మార్చిలో స్టార్ట‌య్యేలానే క‌న‌ప‌డుతుంది.

 అందుకు కార‌ణం బాహుబ‌లి చిత్రీక‌ర‌ణ ఇంకా పూర్తి కాక‌పోవ‌డ‌మేన‌ట‌. బాహుబ‌లి చిత్రీక‌ర‌ణ త‌ర్వాత ప్ర‌భాస్ ముంబై వెళ్లి త‌న లుక్‌ను పూర్తి స్థాయిలో మార్చేస్తాడ‌ట 
 

PREV
click me!

Recommended Stories

AOR Trailer: అనగనగా ఒక రాజు మూవీ ట్రైలర్‌ రివ్యూ, హైలైట్స్ ఇవే.. చిరు, రవితేజకి నవీన్‌ పొలిశెట్టి పోటీ
100 మందితో భారీ యాక్షన్ సీక్వెన్స్, ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ అదిరిపోయే ఫారెస్ట్ సెట్..