తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

ముక్కుతో టమాటాలు కోసిన ప్రభాస్‌, మోహన్‌బాబు కంటే ఆయనదే షార్ప్.. వీడియో వైరల్‌

Aithagoni Raju | Updated : Feb 27 2025, 05:53 PM IST

ప్రభాస్‌, మోహన్‌ బాబు మధ్య సరదా కన్వర్జేషన్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో ప్రభాస్‌ ముక్కుతో టమాటాలు కోసాను అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.   

ప్రభాస్‌, మంచు మోహన్‌బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి `బుజ్జిగాడు` సినిమాలో కూడా నటించారు. ఇందులో మోహన్‌బాబుకి హీరోయిన్‌కి అన్నగా, ప్రభాస్‌ చెన్నై నుంచి వచ్చిన కుర్రాడిగా కనిపించారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం కంటిన్యూ అవుతుంది. అయితే తాజాగా మోహన్‌బాబు, ప్రభాస్‌ మధ్య ముక్కు, టమాటాల సన్నివేశం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నవ్వులు పూయిస్తుంది. మరి ఆ కథేంటో చూస్తే..

`కన్నప్ప` మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్‌ సందడి..

ప్రభాస్‌ పాన్‌ ఇండియా ఇమేజ్‌ని దాటి, గ్లోబల్‌ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలు ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఆదరణ పొందుతున్నాయి. ప్రభాస్‌   డిజాస్టర్‌ మూవీ కూడా మూడు, నాలుగు వందల కోట్లు వసూలు చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్‌ మూవీ వస్తుందంటే ఆడియెన్స్ ఒక సెలబ్రేషన్‌లా ఫీలవుతుంటారు. నెల రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. ఇందులో ప్రభాస్‌తోపాటు ఇతర బిగ్‌ స్టార్స్ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు.

మార్చి 1న `కన్నప్ప` మూవీ టీజర్‌ విడుదల కాబోతుంది..

ప్రభాస్‌ ప్రస్తుతం తన రెండు సినిమాలతోపాటు `కన్నప్ప`లో కీలక పాత్రలో నటిస్తున్నారు. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ చేస్తుండగా, ప్రభాస్‌, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ మూవీ ఏప్రిల్‌ 25న విడుదల కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ముంబయిలో అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. అక్కడ సెలబ్రిటీలకు, మీడియాకి టీజర్‌ని చూపించారు. మార్చి 1న టీజర్‌ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.  

ప్రభాస్‌, మోహన్‌ బాబు మధ్య సరదా `ముక్కు` కన్వర్జేషన్‌.. 

నెమ్మదిగా సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. సోషల్‌ మీడియాలో తరచూ ఏదో రూపంలో రచ్చ చేస్తున్నారు మంచు విష్ణు. తాజాగా ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో మోహన్‌బాబు, ప్రభాస్‌ మధ్య కన్వర్జేషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముక్కుల గురించి ప్రస్తావన వచ్చింది. మోహన్‌బాబు ముక్కుని ఉద్దేశించి నీ ముక్కు షార్ప్ నా, నా ముక్కు షార్ప్ నా అని ప్రస్తావించారు ప్రభాస్‌. 

తాను చిన్నప్పుడు తన ముక్కుతో టమాటాలు కోసాడట. నువ్వు నీ ముక్కుతో టమాటాలు కోసావా అంటూ లేదంటాడు మోహన్‌బాబు. దీంతో అయితే నా ముక్కే షార్ప్ అని ఆటపట్టిస్తాడు ప్రభాస్‌.  ఆ విషయాన్ని మళ్లీ చెప్పు అని మంచు విష్ణు అంటారు. ఆయన మోహన్‌బాబు, ప్రభాస్‌ల మధ్య ఈ కన్వర్జేషన్‌ని వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

మోహన్‌ బాబుని ప్రభాస్‌ `బావా` అని ఎందుకు పిలుస్తాడు? 

అయితే ప్రభాస్‌, మోహన్‌బాబుని బావా అని పిలుస్తాడు. దానికి సంబంధించిన వివరణ ఏంటంటే `బుజ్జిగాడు` సినిమాలో మోహన్‌బాబు హీరోయిన్‌ త్రిషకి అన్నగా నటించడంతో త్రిష తనకు లవర్‌ కావడంతో బావ అని పిలవడం స్టార్ట్ చేస్తాడు ప్రభాస్‌. అప్పుడు స్టార్ట్ అయిన ఈ `బావా` పిలుపు ఇప్పటికీ కంటిన్యూ అవుతుందట. 

read  more: `డ్రాగన్‌` సెన్సేషన్‌ కయాదు లోహర్‌ ఎవరో తెలుసా? బ్యాక్‌ గ్రౌండ్‌ క్రేజీ.. అస్సాం, బెంగుళూరు, చెన్నై

also read: మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై కొత్త సస్పెన్స్, బాలకృష్ణ అంత డేర్‌ చేస్తాడా? ఏంటీ అయోమయం
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!