
ఒకప్పుడు కర్ణాటకలోని బెంగళూరులో బస్ కండక్టర్‌గా టికెట్ టికెట్ అంటూ అరిచే శివాజీ రావ్ గైక్వాడ్ నేడు భారతదేశపు సూపర్ స్టార్ రజనీకాంత్! అవును, ఈ మార్పు, ఈస్టార్ డమ్. కోట్లాది హృదయాల్లో స్తానం ఆయనకు ఎలా వచ్చాయి. అందరిని ఆశ్చర్యపరిచినా కళ్ళకు కనిపించే నిజం. ఇది ఎలా సాధ్యం అయ్యింది. అద్భుతమా లేదా ప్రయత్నమా..? సొంత సామర్థ్యమా లేదా ఎవరైనా చేయి అందించారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇక్కడ ఉంది..
Also Read: శోభన్ బాబు అత్తా అని ముద్దుగా పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?
శివాజీ రావ్ గైక్వాడ్ అనే కుర్రాడు కన్నడ సినిమాలో నటించినా అది అతనికి బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత అతను తమిళ సినిమా పరిశ్రమకు వెళ్ళాడు. అక్కడ కె. బాలచందర్ నుండి అవకాశం పొంది, ఆయన శిక్షణలో రాటుదేలిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకదాని తర్వాత మరొక సినిమాలో నటిస్తూ శివాజీ రావ్ స్టార్ నటుడిగా ఎదిగాడు. పేరు కూడా మారింది, శివాజీ రావ్ కాస్త రజనీకాంత్ (Rajinikanth) అయ్యాడు.. ఆతరువాత కొంత కాలానికి సూపర్ స్టార్ రజినీకాంత్ గా ఎదిగాడు.
74 ఏళ్ల వయస్సులో కూడా రజనీకాంత్ హీరోగానే నటిస్తాడు, యాక్షన్ సీన్స్ అదరగొడుతున్నాడు. మరి ఇది ఎలా సాధ్యం అయ్యింది అంటే.. దాని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. నటుడు రజనీకాంత్ గత 20 సంవత్సరాలుగా ప్రాణాయామం మరియు యోగా సాధన చేస్తున్నారు. అంతేకాకుండా, హిమాలయాలకు వెళ్లి గురువుల సన్నిధిలో కూర్చుని 20-25 రోజుల పాటు యోగాభ్యాసం చేసి వస్తారు. ఇవన్నీ చాలా మందికి తెలిసిన రహస్యాలే.
Also Read: నాగార్జున కు నైట్ నిద్ర పట్టకపోతే ఏం చేస్తాడో తెలుసా? టాలీవుడ్ మన్మథుడి స్లీపింగ్ సీక్రెట్ ?
తెలియని రహస్యం ఒకటి ఉంది.. అదేమిటంటే, నటుడు రజనీకాంత్ జీవిత లక్ష్యం.. అంటే, నటుడు రజనీకాంత్ ఒకసారి తన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. నేను చాలా సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉన్నాను. నాకు ఒక విషయం స్పష్టమైంది.. నా జీవిత లక్ష్యమే ఇది, అంటే.. ఈ రోజు నేను ఏమైతే ఉన్నానో అదే నా జీవిత లక్ష్యం.. దీని కోసమే నేను జన్మించాను' అని అన్నారు.
అంటే, ప్రతి ఒక్కరూ ఈ భూమికి ఒక లక్ష్యం కోసమే పుట్టి వస్తారు. కానీ, చాలా మందికి దాని గురించి అవగాహన ఉండదు. నేను ఆ తప్పు చేయలేదు. నా లక్ష్యం ఏంటో నేను తెలుసుకున్నాను. దానికోసమే కష్టపడ్డాను అన్నారు. నటుడు రజనీకాంత్ లాగా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైతే, మన జీవిత లక్ష్యం ఏమిటనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. లేదా, అర్థం కాకున్నా, మనం ఏమైతే ఉన్నామో అదే మన జీవిత లక్ష్యం అవుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అని అంటారు.