ఆమెతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, రాజమౌళి నన్ను టార్చర్ పెట్టారు.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంచలన ఆరోపణలు

Published : Feb 27, 2025, 05:00 PM ISTUpdated : Feb 27, 2025, 05:28 PM IST
ఆమెతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, రాజమౌళి నన్ను టార్చర్ పెట్టారు.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంచలన ఆరోపణలు

సారాంశం

Rajamouli Controversy: దర్శక ధీరుడు రాజమౌళి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. సినిమాల పరంగా రాజమౌళి అప్పుడప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అది పక్కన పెడితే తాజాగా రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి ఒక వ్యక్తి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు.

Rajamouli Controversy: దర్శక ధీరుడు రాజమౌళి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. సినిమాల పరంగా రాజమౌళి అప్పుడప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అది పక్కన పెడితే తాజాగా రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి ఒక వ్యక్తి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. తాను రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ ని అంటూ శ్రీనివాసరావు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. రాజమౌళిది, తనది 34 ఏళ్ళ స్నేహం అని తెలిపారు. 

రాజమౌళి ఫ్రెండ్ ని అంటూ సెల్ఫీ వీడియో 

సెల్ఫీ వీడియో ద్వారా రాజమౌళి, రమా రాజమౌళిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నాకు, శ్రీనివాస రావు మాట్లాడుతూ తాను యమదొంగ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. శాంతినివాసం సీరియల్ కి ముందు నుంచే రాజమౌళితో స్నేహం ఉంది. ఆ సమయంలో నాకు, రాజమౌళికి మధ్య ఒక అమ్మాయి వచ్చింది. ఆర్య 2 తరహాలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ సాగింది అని తెలిపారు. కానీ రాజమౌళి కోసం తాను త్యాగం చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. 

రాజమౌళి, రమా రాజమౌళి వల్ల నేను ఇప్పుడు చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. వాళ్లిద్దరూ తనని టార్చర్ చేస్తున్నారు అని పేర్కొన్నారు. అప్పటి లవ్ మ్యాటర్ ని తాను లీక్ చేస్తాననే భయంతో రాజమౌళి తనని వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీనివాస రావు కామెంట్స్ సంచలనంగా మారాయి. 

పబ్లిసిటీ కోసమేనా ?

అయితే అందుతున్న సమాచారం మేరకు అతడు చెప్పింది వాస్తవం కాదని, పబ్లిసిటీ స్టంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీనివాసరావు గురించి అంతా ఆరా తీసే పనిలో ఉన్నారు. సడెన్ గా సెల్ఫీ వీడియో తీసి రాజమౌళి, రమా రాజమౌళిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. శ్రీనివాస రావు మాట్లాడుతూ అప్పుడు జరిగిన వ్యవహారానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. కానీ కావాలంటే లైవ్ డిటెక్ట్ టెస్ట్ చేసుకోవాలని, అప్పుడు నిజాలు బయట పడతాయని శ్రీనివాసరావు తెలిపారు. 

మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. అందులో నిజం లేదని, ఆయన కావాలని చెబుతున్నాడని అన్నాడు. ఆయనకు ఏమైందో, ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని చెప్పారు. ప్రస్తుతం శ్రీనివాస రావు సెల్ఫీ వీడియోపై పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు