Prabhas,Maruthi Movie: ప్రభాస్ ,మారుతి సినిమాకు ముహూర్తం ఫిక్స్, షూటింగ్ స్టార్ట్ అయ్యేదెప్పుడంటే...?

Published : May 08, 2022, 10:19 PM IST
Prabhas,Maruthi Movie: ప్రభాస్ ,మారుతి సినిమాకు ముహూర్తం ఫిక్స్, షూటింగ్ స్టార్ట్ అయ్యేదెప్పుడంటే...?

సారాంశం

ప్రభాస్ నుంచి మరో క్రేజీ సినిమా అప్ డేట్ రాబోతోంది. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న యంగ్ రెబల్ స్టార్.. మరో కొత్త సినిమాను సెట్స్ ఎక్కించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 

ప్రభాస్ నుంచి మరో క్రేజీ సినిమా అప్ డేట్ రాబోతోంది. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న యంగ్ రెబల్ స్టార్.. మరో కొత్త సినిమాను సెట్స్ ఎక్కించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 

యూనివర్సల్ స్టార్  ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో తీరిక  లేకుండా గడిపేస్తున్నాడు. ప్ర‌స్తుతం  ప్రభాస్ చేతిలో  ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి.  రీసెంట్ గా  రాధేశ్యామ్‌ సినిమాతో  ఆడియన్స్ ముందు వచ్చాడు, కాని ఈ సినిమా ఆయన్ను గట్టిగా నిరాశ పరిచింది. అటు ఆడియన్స్ కూడా బాగా డిస్సపాయింట్ అయ్యారు.  ఇక ప్ర‌స్తుతం ప్రభాస్ నెక్ట్స్ సినిమాల విషయంలో  గట్టిగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ప్రభాస్ ఇక  త‌న త‌దుప‌రి సినిమాల‌పై పూర్తి ఫోక‌స్‌ను పెట్టాడు.  ప్రస్తుతం  మోకాలికి  స‌ర్జ‌రీ చేసుకున్న  కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్.  గాయం త‌గ్గ‌డంతో  రీసెంట్ గా  ప్రాజెక్ట్‌-K షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యుల్ పూర్త‌వ్వ‌గానే స‌లార్ లాంగ్ షెడ్యూల్‌లో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్ర‌భాస్ సినిమాకు సంబంధించి మరో సినిమా అప్ డేట్ వచ్చేసింది. 

ప్ర‌భాస్- మారుతి కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు  సంబంధించిన అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్ లో షికారు చేస్తోంది. సూప‌ర్ నాచ్యుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమా  ఆగ‌స్టులో పట్టాలెక్కనున్నట్టు సమాచారం. అదే నెలలో ఓపెనింగ్ తో పాటు రెగ్యులర్  షూటింగ్ కూడా  ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. డివివి దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళ‌వికా మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

ఇక మొద‌టి షెడ్యుల్‌లో ప్ర‌భాస్‌, మ‌ళ‌వికా మ‌ధ్య స‌న్నివేశాలు తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈమూవీలో పెళ్ళి సందడి ఫేమ్ శ్రీలీలాతో పాటు రాశీ కన్నా లాంటి మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు   ప్ర‌భాస్ 100రోజులు కాల్షీట్లు మాత్ర‌మే ఇచ్చాడ‌ట‌. ఇక ఈ చిత్రం కోసం మేక‌ర్స్ హైద‌రాబాద్‌లో ఒక పెద్ద బంగ్లా సెట్‌ను వేశార‌ని టాక్. మూవీకి  రాజా డిల‌క్స్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. 

ప్ర‌భాస్ ఆదిపురుష్  షూటింగ్‌  పూర్తి చేసుకుని ప్రస్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులలో బిజీగా ఉంది.  రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు ఓ రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.  వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. . వీటితో పాటుగా ప్ర‌భాస్‌, సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ మూవీని కూడా చేయబోతున్నాడు. వీటితో పాటు మరికొన్ని సినిమా కథలను హోల్డ్ లో పెట్టాడు ప్రభాస్. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే