
ప్రభాస్ ఫ్యాన్స్ ప్రపంచ అంతా ఉన్నారు. ఇండియా తరువాత ప్రభాస్ కు చైనా, జపాన్, సింగపూర్, లాంటి దేశాల్లో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో.. ప్రభాస్ ఓ బ్రాండ్. ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాలు జపాన్ లో భారీ విజయం సాధించాయి. అక్కడ కొన్ని వస్తువులు కూడా ప్రభాస్ పేరుమీద బాగాసేల్ అవుతుంటాయి. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే చాలు.. జపాన్ లో పండగే. ఒక్కోసారి జపాన్ అభిమానులు హైదరాబాద్ లో ప్రభాస్ ఇంటికి కూడా వచ్చి ఆయన్ను కలిసి వెళ్ళారంటే..ప్రభాస్ ఇమేజ్ అలాంటిది మరి. ఇక తాజాగా జపాన్ కు చెందిన ప్రభాస్ మహిళా అభిమాని ఒకరు ఓ సాహసం చేశారు.
ప్రభాస్ తాజా సినిమా ఆదిపురుష్. ఆదిపురుష్ సినిమా ఇండియాతో పాటు ప్రపంచం వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కాని కొన్ని దేశాల్లో ఆదిపురుష్ రిలీజ్ అవ్వలేదు. అయితే ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న జపాన్ లో మాత్రం ఇంకా ఆదిపురుష్ సినిమా రిలీజ్ అవ్వలేదు. . జపాన్ లో ప్రభాస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఓ మహిళా అభిమాని ప్రభాస్ ఆదిపురుష్ సినిమా జపాన్ లో ఇంకా రిలీజవ్వలేదని సినిమా చూడటానికి సింగపూర్ వరకు వచ్చింది.
నోరికో అనే జపాన్ మహిళా ప్రభాస్ కు వీరాభిమాని. ఆయన సినిమా కోసం ఎదరుచూస్తు ఉన్న ఆమెకు.. ఆదిపురుష్ జపాన్ లో రిలీజ్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉందని తెలుసుకుంది. ఎలాగైనా ప్రభాస్ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యింది. ఎంతో ఖర్చు పెట్టుకుని మరీ జపాన్ కు కాస్త దగ్గరగా ఉండే సింగపూర్ వచ్చి ఆదిపురుష్ సినిమా చూసింది ఇది తెలుసుకున్న అక్కడి ఇండియన్స్ ఆమెతో మాట్లాడించి ఓ వీడియోని తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఆ వీడియోలో ప్రభాస్ జపాన్ అభిమాని మాట్లాడుతూ.. నా పేరు నోరికో, జపాన్ నుంచి వచ్చాను. నాకు ప్రభాస్ అంటే ఇష్టం, ప్రభాస్ ఫ్యాన్ ని అని చెప్పింది. చివర్లో ప్రభాస్ రాముడిగా ఉన్న ఓ జెండాను చూపించింది. దీంతో ఈ వీడియోను.. ఆ అమ్మాయిని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను శేర్ చేస్తున్నారు.
ఇక ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు ముందు నుంచీ వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ తరువాత కూడా ఆదిపురుష్ సినిమాపై వివాదాలు ఇంకా పెరిగాయి తప్పించి తగ్గలేదు. కానీ ప్రభాస్ తో పాటు ఆయన అభిమానులు మాత్రం అవేమి లెక్క చేయకుండా సినిమా చూడటానికి వస్తున్నారు. కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్ సినిమా దాదాపు 400 వందల కోట్లకు పైగా సాధిచింది. ప్రస్తుతం ఆదిపురుష్ జోరు చాలా వరకూ తగ్గింది.
ఇక ఆదిపురుష్ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్ నటించగా.. రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణంలో కొన్ని ఘట్టాలు ఆధారంగా ఈసినిమాన రూపొందించారు.