షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ తొలి సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే? కోట్ల ఆస్తులు కొనుగోలు

Published : Jun 23, 2023, 09:11 PM ISTUpdated : Jun 23, 2023, 09:14 PM IST
షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ తొలి సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే? కోట్ల ఆస్తులు కొనుగోలు

సారాంశం

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌.. కూతురు సుహానా ఖాన్‌ సోషల్‌ మీడియాలో అందాలతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె తాజాగా కోట్ల విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ వందల కోట్ల ఆస్తులకు అధిపతి. ఆయన హీరోగా ఎంతో సంపాదించాడు. అనేక లగ్జరీ బంగ్లాలు, కార్లు, ఇతర ఆస్తులున్నాయి. కానీ తన కూతురు సుహానా ఖాన్‌ ఇప్పుడు పెద్ద షాకిచ్చింది. భారీ ఆస్తులు కూడబెట్టి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తన తొలి సంపాదనతో కోట్ల విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేయడం విశేషం. ఆమె మహారాష్ట్రలోని అలీబాగ్‌లో భారీ విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

సుహానా ఖాన్‌ తన తొలి సంపాదనతో రూ.12.91కోట్లతో ఆస్తులను కొనుగోలు చేసిందట. ఇది అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అందులో భాగంగా సుహానా ఖాన్‌ మూడు ఇళ్లతోపాటు, ఒక ప్లాట్‌ని కొనుగోలు చేసినట్టు బాలీవుడ్‌ మీడియా రాసుకొచ్చింది. రిజిస్ట్రేషన్‌లో సుహానా పేరుని రైతుగా నమోదు చేశారని తెలుస్తుంది. సుహానా అమ్మమ్మ సవితా ఛిబ్బర్, ఆమె సోదరి నమితా చిబ్బర్‌ డైరెక్టర్లుగా ఉన్న డెజా వు ఫార్మ్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఈ ఆస్తిని జూన్‌ 1న రిజిస్ట్రేషన్‌ చేసినట్టు ప్రముఖ మీడియా సంస్థ హిందుస్థాన్‌ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. 

ఈ ఆస్తుల్లో.. ఎకరంన్నర భూమి, 2218 చదరపు అడుగుల్లో ఒక ఇళ్లు ఉంది. దీనికోసం 77 లక్షల  స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు సుహానా. ఇక సుహానా ఖాన్‌ కొనుగోలు చేసిన అలీబాగ్‌లో షారూఖ్‌ కి ఓ లగ్జరీ బంగ్లా ఉంది. అలాగే అక్కడ బాలీవుడ్‌ స్టార్లు రణ్‌ వీర్ దీపికా పదుకొనె జంట, విరాట్‌ కొహ్లీ-అనుష్క శర్మ వంటి సెలబ్రిటీల ఇళ్లు ఉండటం విశేషం. 

ఇదిలా ఉంటే సుహానా ఖాన్‌ నటిగా తెరంగేట్రం చేస్తుంది. ఆమె జోయా అక్తర్‌ దర్శకత్వంలో రూపొందిన `ది అర్చీస్‌` అనే సినిమాలో నటిస్తుంది. `ది అర్చీస్‌` అనేది 1960ల నాటి భారతదేశంలోని లైవ్‌ యాక్షన్‌ మ్యూజికల్‌ సెట్‌. ఈ సినిమాలో బోనీ కపూర్‌ రెండో కుమార్తె ఖుషీ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందా కూడా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే టీజర్‌ విడుదలై ఆకట్టుకుంది. ఇది నెట్‌ ఫ్లిక్స్ లో వచ్చే ఏడాది విడుదల కానుంది. సుహానా ఖాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఇంటర్నెట్‌లో వేడిపెంచుతుంటుంది. సినిమాల్లోకి రాకముందే గ్లామర్‌ డోస్‌తో పిచ్చెక్కిస్తుంది. ఇక సినిమాల్లోకి వచ్చాక ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thalapathy Vijay: 2 లక్షల నుంచి 9 కోట్ల వరకు.. దళపతి గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఇవే..
Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్