Kalki 2898 AD: సంక్రాంతి రోజున ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా.. కల్కి 2898 టీజర్ రెడీ..

By tirumala AN  |  First Published Jan 11, 2024, 10:01 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ హంగామా ముగిసినట్లే. చాలా రోజుల తర్వాత ప్రభాస్ సలార్ చిత్రంతో అభిమానుల దాహం తీర్చేశాడు. సలార్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ హంగామా ముగిసినట్లే. చాలా రోజుల తర్వాత ప్రభాస్ సలార్ చిత్రంతో అభిమానుల దాహం తీర్చేశాడు. సలార్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఇక ప్రభాస్ అభిమానుల ఫోకస్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి  2898 ఎడిపై పడింది. 

అందుతున్న సమాచారం మేరకు సంక్రాంతికి కల్కి నుంచి టీజర్ రాబోతున్నట్లు తెలుస్తోంది సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెకెక్కుతున్న ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ ని తలదన్నే చిత్రంగా కల్కి తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ టీజర్ వచ్చింది. ఆ టీజర్ లో కల్కి ప్రపంచం ఎలా ఉండబోతోందో అనే జస్ట్ సినాప్సిస్ మాత్రమే చూపించారు. కిక్కిచ్చే ఎలిమెంట్ ఏమీ చూపించలేదు. 

Latest Videos

అయితే ఈ సంక్రాంతికి నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా టీజర్ కి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు టీజర్ కి యుఎ సర్టిఫికెట్ ఇచ్చారట. టీజర్ 1 నిమిషం 23 సెకండ్ల నిడివి తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

అదే విధంగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కూడా సంక్రాంతికి రానున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో సంక్రాంతికి ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి. 

click me!