కేశవ అరెస్ట్ తో పుష్ప 2 రిలీజ్ డేట్ పై డౌట్స్.. సుక్కు బర్త్ డే రోజున ఆ విషయం నొక్కి మరీ చెప్పారుగా 

Published : Jan 11, 2024, 06:45 PM IST
కేశవ అరెస్ట్ తో పుష్ప 2 రిలీజ్ డేట్ పై డౌట్స్.. సుక్కు బర్త్ డే రోజున ఆ విషయం నొక్కి మరీ చెప్పారుగా 

సారాంశం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రం కోసం అభిమానులు మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ చేసిన మ్యాజిక్ అలాంటిది. డైరెక్టర్ సుకుమార్ అయితే పుష్ప మొదటి భాగానికి పదింతలు పవర్ ఫుల్ గా ఉండేలా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రం కోసం అభిమానులు మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ చేసిన మ్యాజిక్ అలాంటిది. డైరెక్టర్ సుకుమార్ అయితే పుష్ప మొదటి భాగానికి పదింతలు పవర్ ఫుల్ గా ఉండేలా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ అంతా అనుకున్నట్లుగా సాఫీగా జరుగుతున్న సమయంలో ఊహించని సెట్ బ్యాక్ ఎదురైంది. 

 పుష్పలో అల్లు అర్జున్ కి అసిస్టెంట్ గా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ ఊహించని కేసులో అరెస్ట్ అయ్యాడు.   ఓ యువతిని జగదీష్ వేధింపులకు గురి చేశాడని ఆరోపణులు వినిపించాయి. ఆమె మరో వ్యక్తితో ఉన్న ప్రైవేట్ ఫోటోలని జగదీష్ తీసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. 

దీనితో జగదీష్ బెదిరింపులకు, వేధింపులు భరించలేక సదరు యువత గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం జగదీష్ అంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్న జగదీష్ ని పంజాగుట్ట పోలీసులు డిసెంబర్ 6న అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగదీష్ పై ఉన్న ఆరోపణలు నిజమైతే అతడికి తీవ్రమైన చిక్కులు తప్పవు. 

ఈ క్రమంలో పుష్ప 2 చిత్రం అనుకున్న సమయానికి రావడం కష్టమే అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి అయితే నేడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా అనుమానాలన్నీ చిత్ర యూనిట్ పటాపంచలు చేసింది. సుకుమార్ కి బర్త్ డే విషెస్ చెబుతూ పుష్ప 2 చిత్రం ముందుగా అనుకున్నట్లుగా 2024 ఆగష్టు 15న ఈ చిత్రం రిలీజ్ అవుతోందని స్పష్టం చేశారు. సుకుమార్ విజన్ తో పుష్ప 2 భారీ స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. దీనితో బన్నీ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..