Annapoorni : నయనతార ‘అన్నపూర్ణి’ మూవీ బ్యాన్... ఓటీటీ నుంచి డిలీట్.! వివరాలు

By Nuthi SrikanthFirst Published Jan 11, 2024, 5:36 PM IST
Highlights

ఓటీటీలో నుంచి నయనతార నటించిన వివాదాస్పద చిత్రం ‘అన్నపూర్ణి’ Annapoorni  మూవీని తొలగించారు. ఇటీవల ఈ మూవీపై అభ్యంతరాలు కూడా వ్యక్తం అవడంతో సినిమాను బ్యాన్ చేశారు. దీనికి గల కారణాలపై అటు మేకర్స్ కూడా స్పందించారు. 
 

లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార Nayanthara నటించిన రీసెంట్ ఫిల్మ్ ‘అన్న‌పూర్ణి’. ఓటీటీ లో విడుదలైంది. ఈ మూవీ డిసెంబ‌ర్ 29న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కులను అలరిస్తోంది. థియేట‌ర్ల‌లో కేవ‌లం త‌మిళ భాష‌లోనే రిలీజైంది. ఓటీటీలో మాత్రం తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్లు హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. అంతేకాదు, ఈ చిత్రం లవ్ జిహాద్ ను బలపరిచేలా ఉందని రమేశ్ సోలంకి అనే వ్యక్తి విమర్శించారు. అన్నపూర్ణి చిత్ర నిర్మాతలపైనా, ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ పైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మరోవైపు విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ సైతం అన్నపూరణి సినిమాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం తాజాగా చిత్రాన్ని తొలగించింది. దీనిపై మేకర్స్ వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈమేరకు జీ ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి అధికారిక వివరణ అందింది. 

Latest Videos

ఈచిత్రంపై వచ్చిన విమర్శలతో సినిమాను మళ్లీ ఎడిట్ చేసేంత వరకు నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించడాన్ని అంగీకరిస్తున్నాం. ఈ సినిమాకు ఉద్దేశపూర్వకంగా కో - ప్రొడ్యూసర్ గా లేమని ‘జీ ఎంటర్ టైన్ మెంట్’ తెలిపింది. హిందువులు, బ్రాహ్మణ కమ్యూనిటీల సెంటిమెంట్స్ కు బాధ కలిగించి ఉంటే క్షమించండి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘అన్నపూర్ణి’ మూవీ ఓటీటీ నుంచి డిలీట్ అయ్యింది.   

click me!