లాంగ్ షెడ్యూల్ లో యాక్షన్ ఇరగదీయనున్న ప్రభాస్!

Published : Sep 19, 2021, 12:56 PM IST
లాంగ్ షెడ్యూల్ లో యాక్షన్ ఇరగదీయనున్న ప్రభాస్!

సారాంశం

ఆదిపురుష్ కోసం ముంబైలో దర్శకుడు లాంగ్‌ షెడ్యూల్‌ ప్రారంభించారట. దాదాపు 25 రోజుల పాటుజరిగే ఈ షెడ్యూల్‌లో, క్లైమ్యాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట.

డార్లింగ్ ప్రభాస్‌ తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న మూడు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. రాధే శ్యామ్ షూటింగ్ మొదలై రెండేళ్లు దాటిపోగా, 2021లో ఆదిపురుష్, సలార్ చిత్రాల షూటింగ్స్ మొదలుపెట్టారు. సలార్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని, మూడవ షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. 


ఇక దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ పౌరాణిక చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆదిపురుష్ కోసం ముంబైలో దర్శకుడు లాంగ్‌ షెడ్యూల్‌ ప్రారంభించారట. దాదాపు 25 రోజుల పాటుజరిగే ఈ షెడ్యూల్‌లో, క్లైమ్యాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన రిహార్సల్స్‌ కూడా ఆరంభించారట ప్రభాస్‌. ముందుగా యాక్షన్‌ సీన్స్, ఆ తర్వాత టాకీ పార్ట్‌ని చిత్రీకరిస్తారని సమాచారం.

కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ రాముడి పాత్ర చేస్తుండగా, రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్ చేస్తున్నారు. సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ కనిపిస్తారు. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబరు 11న విడుదల కానుంది. మరోవైపు దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించిన భారీ చిత్రం ప్రాజెక్ట్ కే సైతం లాంఛింగ్ ఈవెంట్ జరుపుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది