నీలి చిత్రాల కేసు... సరైన ఆధారాలు లేకున్నా, నన్ను బలిపశువును చేశారు!

Published : Sep 19, 2021, 10:01 AM IST
నీలి చిత్రాల కేసు... సరైన ఆధారాలు లేకున్నా, నన్ను బలిపశువును చేశారు!

సారాంశం

తాజాగా ముంబైలోని కోర్టులో బెయిల్‌ కోసం రాజ్ కుంద్రా దరఖాస్తు చేసుకున్నారు. ముంబై పోలీసులు ఈ కేసులో భాగంగా తాజాగా కోర్టు అందజేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సమర్పించలేదని, బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కుంద్రా కోరారు.

పోర్నోగ్రఫీ ఆరోపణలపై అరెస్ట్‌ అయిన నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా జైలు జీవితం గడుపుతున్నారు. విచారణ పేరుతో ఆయన జ్యూడిషల్ కష్టడీకి అధికారులు తీసుకున్నారు. బెయిల్ కోసం రాజ్ కుంద్రా చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. తాజాగా ముంబైలోని కోర్టులో బెయిల్‌ కోసం రాజ్ కుంద్రా దరఖాస్తు చేసుకున్నారు. ముంబై పోలీసులు ఈ కేసులో భాగంగా తాజాగా కోర్టు అందజేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సమర్పించలేదని, బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కుంద్రా కోరారు.ఈ కేసులో తనను బలిపశువును చేశారని మెట్రోపాలిటన్‌ కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రాక్టికల్‌గా చూస్తే ఈ కేసులో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల దర్యాప్తు ముగిసిపోయిందని కుంద్రా తరఫు న్యాయవాది ప్రశాంత్‌ పాటిల్‌ అభిప్రాయ పడ్డారు. హాట్‌షాట్స్‌ యాప్స్‌లో ఉన్న శృంగార వీడియోల రూపకల్పనలో కుంద్రా క్రియాశీల పాత్ర పోషించారనే ఏ ఒక్క ఆధారాన్నీ పోలీసులు అనుబంధ చార్జ్‌షీట్‌లో పొందు పరచలేదని న్యాయవాది వివరించారు.

మరోవైపు భర్త రాజ్ కుంద్రాపై శిల్పా శెట్టి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజ్ కుంద్రా వ్యవహారాల గురించి తనకు తెలియదన్న శిల్పా శెట్టి, ఆయన గురించి తనను అడగవద్దని మీడియాపై ఫైర్ అయ్యారు. రాజ్ కుంద్రా అరెస్ట్ తరువాత కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్న శిల్పా, మరలా యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పంచుకుంటున్నారు. అలాగే బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

AK 47 Teaser Review: ఫ్యామిలీ ఇమేజ్‌ని పక్కన పెట్టిన వెంకటేష్‌, ఎందుకంటే?.. ఆదర్శ కుటుంబ టీజర్‌ ఎలా ఉందంటే?
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?