
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యోగి చిత్రం గుర్తిందిగా. ప్రభాస్ కెరీర్ లో మోస్ట్ హైప్ తో రిలీజైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. వివి వినాయక్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకోలేక చతికిలబడింది. కానీ ఈ చిత్రంలో 'ఓరోరి యోగి' అనే ఐటెం సాంగ్ ఒక ఊపు ఊపింది.
ప్రభాస్, ముమైత్ ఖాన్ ఇద్దరూ ఎనెర్జిటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకున్న ఈ సాంగ్ ఇప్పటికి మాస్ ప్రియులకు హుషారెత్తించే విధంగా ఉటుంది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే మరో రూపంలో.. ఈ ఐటెం పాటని ఏకంగా భక్తిపాటగా కన్నడలోకి రీమేక్ చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్ లో రచ్చ సృష్టిస్తున్నాయి.
భక్తి పాట అయినప్పటికీ ఒరిజినల్ ఐటెం సాంగ్ తో బీట్ ని మ్యాచ్ చేస్తూ అదరగొట్టారు. ఈ సాంగ్ వింటున్న నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా దీనిని భక్తి పాటలా ఎలా మార్చారు అని ఆశ్చర్యపోతున్నారు.
చాలా మంది నెటిజన్లు ఇదే ఒరిజినల్ సాంగ్ లాగా ఉంది.. ఐటెం సాంగ్ రీమేక్ అనిపిస్తోంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. యోగి చిత్రాన్ని దర్శకుడు వివి వినాయక్ కన్నడ మూవీ జోగి నుంచి రీమేక్ చేశారు. కానీ ఈ చిత్రంలోని తల్లి సెంటిమెంట్ అంతగా తెలుగు ఆడియన్స్ కి ఎక్కలేదు. ఫలితంగా మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.