
టాలీవుడ్‌లోకి సునామీలా దూసుకొచ్చింది శ్రీలీల. వచ్చీ రావడంతోనే స్టార్ హీరోయిన్లందరికి చెక్ పెట్టింది. వారి అవకాశాలను కొల్లగొడుతూ ఫుల్ జోష్‌లో ఉంది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లని అందుకుంటూ స్పీడుమీదుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏకంగా పది సినిమాలుండటం విశేషం. సూపర్ స్టార్స్ మూవీస్ నుంచి యంగ్ హీరోల చిత్రాల వరకు చేస్తుంది. క్షణం తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజ్, డిమాండ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఆమె తర్వాతనే మరెవ్వరైనా.
దాదాపు రెండేళ్ల వరకు శ్రీలీల కాల్షీట్లు ఖాళీ లేవంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో శ్రీలీల ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుందట. సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇంతటి బిజీగా ఉన్న శ్రీలీల బ్రేక్ తీసుకోవడమే ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఆమె గ్యాప్ తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంబీబీఎస్ చేస్తుంది. చివరి సంవత్సరంలో ఉందట. నవంబర్, డిసెంబర్, జనవరి మధ్య కాలంలో ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయట. అందుకోసం దాదాపు రెండు నెలలు బ్రేక్ తీసుకుంటుందని సమాచారం.
శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేసి రావాలనుకుంటుంది. అందుకోసమే రెండు నెలల గ్యాప్ తీసుకోబోతుందట. అయితే అందుకు మేకర్స్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ లోపు ఇంపార్టెంట్ ఉన్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేయాలని భావిస్తున్నారట. నవంబర్ నుంచి ఈ బ్యూటీ సినిమాలకు దూరం కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న సినిమాల జాబితా చూస్తే.. బాలకృష్ణతో `భగవంత్ కేసరి`లో నటిస్తుంది. ఇందులో బాలయ్యకి కూతురు పాత్రలో కనిపించబోతుంది. కాజల్ హీరోయిన్. పవన్ కళ్యాణ్‌తో `ఉస్తాద్ భగత్ సింగ్`లో నటిస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మహేష్‌బాబుతో `గుంటూరు కారం`లో హీరోయిన్‌గా చేస్తుంది. మీనాక్షి చౌదరీ మరో కథానాయిక. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రామ్-బోయపాటి `స్కంధ`లో, నితిన్ `ఎక్ట్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్`లో, వైష్ణవ్ తేజ్ `ఆదికేశవ` చిత్రంలో, విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి మూవీలో, నితిన్-వెంకీ కుడుముల చిత్రంలో, చిరంజీవి-కళ్యాణ్ కృష్ణ మూవీలో హీరోయిన్‌గా చేస్తుంది శ్రీలీల.