
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఖుషి`. పవన్ కళ్యాణ్ `ఖుషి` టైటిల్‌తో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై ఒకింత క్రేజ్ నెలకొంది. దీనికితోడు సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన మూవీ కావడంతో మరింత ఆసక్తి, హైప్ నెలకొంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని, డ్రామాని పండించడంలో దర్శకుడు శివ నిర్వాణ ది బెస్ట్. `నిన్నుకోరి`, `మజిలి` చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా కావడంతో మరింత అంచనాలు నెలకొన్నాయి.
పాన్ ఇండియా లెవల్‌లో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, టైలర్స్ ఆకట్టుకున్నాయి. పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. పాటలు సినిమాపై పాజిటివ్ నోట్‌ని ఏర్పర్చుతున్నాయి. ఈ నేపథ్యం కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో లైన్ క్లీయర్ అయ్యింది. సెన్సార్ పూర్తి చేసుకుంది. `యూ/ఏ` సర్టిఫికేట్ వచ్చింది.
సినిమా నిడివి కూడా బాగానే ఉంది. టోటల్ రన్ టైమ్ 165 నిమిషాలు రెండు గంటల 45 నిమిషాలు ఉండటం విశేషం. రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూసేలా ఉందని సెన్సార్ రిపోర్ట్ ని బట్టి తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పుడు అంతా ఎదురుచూస్తున్న చిత్రంగా `ఖుషి` నిలవడం విశేషం. ఇక ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించగా, భారీగా బజ్ ఏర్పడింది. దీంతోపాటు `ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్` కి విశేష ఆదరణ లభించింది. సినిమాపై ఇవి హైప్‌ని పెంచాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా? లవ్ స్టోరీస్‌లో మరో క్లాసిక్ అవుతుందా? లేదా అనేది చూడాలి.
ఈ సినిమా విజయం ముగ్గురికి చాలా కీలకం. ఇటు దర్శకుడు శివ నిర్వాణకి, అటు విజయ్ దేవరకొండకి, అలాగే సమంతకి చాలా ముఖ్యం. ఎందుకంటే శివ నిర్వాణ తీసిన గత చిత్రం `టక్ జగదీష్` డిజప్పాయింట్ చేసింది. అలాగే విజయ్‌కి `గీతగోవిందం` తర్వాత విజయం రాలేదు. దీంతో ఒక మంచి సక్సెస్ కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు సమంత నటించిన గత చిత్రం `శాకుంతలం` డిజప్పాయింట్ చేసింది. `యశోద` కూడా మామూలుగానే ఆడింది. దీంతో వీరంతా బౌన్స్ బ్యాక్ కావాలంటే `ఖుషి` పెద్ద హిట్ కావాల్సిందే. మరి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందనేది తెలియలంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే.