చిరంజీవి కోసం ప్రభాస్‌.. అభిమానులతో ముచ్చట్లు.. ఏం చెప్పబోతున్నాడు..?

Published : Aug 21, 2021, 01:27 PM IST
చిరంజీవి కోసం ప్రభాస్‌.. అభిమానులతో ముచ్చట్లు.. ఏం చెప్పబోతున్నాడు..?

సారాంశం

చిరంజీవి కోసం ప్రభాస్‌ కదిలారు. ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తున్నారు. మెగా అభిమానులతో డైరెక్ట్ గా ప్రభాస్‌ ముచ్చటించబోతుండటం విశేషం. ఈ రోజు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మెగా అభిమానుల ఈవెంట్‌ జరుగుతుంది.

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే సందడి షురూ అయ్యింది. చిరంజీవి బర్త్ డే అంటే టాలీవుడ్‌లో ఓ పండగ వాతావరణం నెలకొంటుందనే విషయం తెలిసిందే. రెండు రోజుల పాట సందడే సందడి. మెగాస్టార్ నామ స్మరణం జరుగుతుంది. సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు, రాజకీయాలకు అతీతంగా మెగాస్టార్‌ అభిమానులు ఆయనకు విషెస్‌ని చెప్పడం, ఆయన సినిమాలతో ఆనందించడం చేస్తుంటారు. 

తాజాగా చిరంజీవి కోసం ప్రభాస్‌ కదిలారు. ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు వస్తున్నారు. మెగా అభిమానులతో డైరెక్ట్ గా ప్రభాస్‌ ముచ్చటించబోతుండటం విశేషం. ఈ రోజు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మెగా అభిమానుల ఈవెంట్‌ జరుగుతుంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రతి ఏడాది ఫ్యాన్స్ మీటింగ్‌ జరుగుతుంటుంది. ఇందులో మెగా ఫ్యామిలీ హీరోలు సందడి చేస్తుంటారు. 

అందులో భాగంగా ఈ సారి ప్రభాస్‌ లైవ్లోకి రాబోతున్నారు. ఆయన జూమ్‌ వీడియో ద్వారా మెగా అభిమానులతో ముచ్చటించబోతున్నారు. అయితే చిరంజీవి గురించి ప్రభాస్‌ ఏం చెప్పబోతున్నాడు. చిరుకి ఎలా విషెస్‌ చెప్పబోతున్నాడు, మెగా ఫ్యాన్స్ తో ఆయన ఏం మాట్లాడబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే చిరంజీవికి సంబంధించిన మరో అప్‌డేట్‌ రాబోతుంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న `మెగా154`చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ని కాసేపట్లో ఇవ్వబోతున్నట్టు యూనిట్‌ తెలిపింది. 

ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య`లో నటిస్తున్నారు. దీంతోపాటు ఇటీవలే `చిరు153` చిత్రాన్ని ప్రారంభించారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు మెహర్‌ రమేష్‌తో సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కూడా చిరు బర్త్ డే సందర్బంగా రాబోతుంది. అంతేకాదు `ఆచార్య` చిత్ర విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండు రోజులు మెగా అభిమానులకు పండగే పండగ. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి