`భీమ్లా నాయక్‌` బ్రేక్‌ టైమ్‌.. పవన్‌ తుపాకి పడితే బాక్సాఫీసు దద్దరిల్లిపోదా?

Published : Aug 21, 2021, 10:34 AM IST
`భీమ్లా నాయక్‌` బ్రేక్‌ టైమ్‌.. పవన్‌ తుపాకి పడితే బాక్సాఫీసు దద్దరిల్లిపోదా?

సారాంశం

తాజాగా ఈ సినిమా నుంచి `బ్రేక్ టైమ్‌ ఇన్ భీమ్లా నాయక్ స్టైల్‌` పేరుతో చిన్న వీడియోని విడుదల చేశారు. ఇందులో పవన్‌ తెల్ల దుస్తులు ధరించి కారు పక్కన తుపాకి పట్టి శత్రువుల గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించాడు.

భీమ్లా నాయక్‌ ఈ సారి తుపాకి పట్టాడు. బుల్లెట్ల వర్షం కురిపించాడు. శత్రువు టార్గెట్‌గా తుపాకి ఎక్కుపెట్టి దద్దరిల్లేలా చేశాడు. ఇప్పుడిది దుమ్ములేపుతుంది. ఇదంతా పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రంలోని చిన్న బ్రేక్‌ టైమ్‌ వీడియో క్లిప్‌. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల టైటిల్‌ ఫస్ట్ లుక్‌, వీడియో గ్లింప్స్ ని విడుదల చేయగా, అది రికార్డులు సృష్టించింది. 24గంటల్లోనే 10 మిలియన్స్ ని దాటేసింది. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి `బ్రేక్ టైమ్‌ ఇన్ భీమ్లా నాయక్ స్టైల్‌` పేరుతో చిన్న వీడియోని విడుదల చేశారు. ఇందులో పవన్‌ తెల్ల దుస్తులు ధరించి కారు పక్కన తుపాకి పట్టి శత్రువుల గుండెల్లో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఆయన అడవిలోకి తుపాకీ పట్టుకుని ఒంటరిగా వెళ్తున్న వీడియో క్లిప్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చిత్ర షూటింగ్‌ బ్రేక్‌ టైమ్‌లో పవన్‌ ఇలా అడవిలోకి వెళ్లి రిలాక్స్ అయినట్టుగా తెలుస్తుంది. 

ఈ సందర్భంగా పంచుకున్న ఓ ఫోటో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో `యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు. యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు. నాయకుడు ఈరెండింటినీ తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు` అని పంచుకున్న కొటేషన్‌ ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతుంది.

పవన్‌ కళ్యాణ్‌, రానా హీరోలుగా, నిత్యా మీనన్, ఐశ్వర్యా రాజేష్‌ కథానాయికలుగా, సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్‌` సినిమా రూపొందుతుంది. త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి జనవరి 12న విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?