RRR కొత్త రిలీజ్ డేట్ ఇదే.. మరో 7 నెలలు పడిగాపులే ?

By telugu teamFirst Published Aug 21, 2021, 12:35 PM IST
Highlights

అక్టోబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఏ సంక్రాంతికో  రిలీజ్ కావాలి. కానీ రాజమౌళి ఏకంగా 7 నెలలు ఈ చిత్రాన్ని వాయిదా వేశారనేది ఇన్సైడ్ టాక్.

రాజమౌళి, రిలీజ్ డేట్స్.. బద్ద శత్రువులేమో. ఆర్ ఆర్ ఆర్ విషయంలో మరోసారి రుజువైంది. ఇటీవల చిత్ర యూనిట్ ఉక్రెయిన్ కి వెళ్ళింది. అదే చివరి షెడ్యూల్. ముందుగా అనుకున్న అక్టోబర్ 13న ఈ చిత్రం రిలీజ్ పక్కా అని అని అంతా భావించారు. 

కానీ ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చేస్తే నష్టం అనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

అక్టోబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఏ సంక్రాంతికో  రిలీజ్ కావాలి. కానీ రాజమౌళి ఏకంగా 7 నెలలు ఈ చిత్రాన్ని వాయిదా వేశారనేది ఇన్సైడ్ టాక్. సమ్మర్ లో ఉగాది పండుగకు రిలీజ్ డేట్ పిక్స్ చేసుకున్నట్లు లేటెస్ట్ న్యూస్. 

ఇదే కనుక నిజమైతే అభిమానులకు మరో ఏడు నెలలు పడిగాపులు తప్పవు. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నా.. సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఆ చిత్రాల రిలీజ్ డేట్స్ ని డిస్ట్రర్బ్ చేయడం ఇష్టంలేక రాజమౌళి ఉగాది రిలీజ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై బజ్ ని 7 నెలల పాటు సస్టైన్ చేయడమే జక్కన్న ముందు ఉన్న బిగ్ ఛాలెంజ్. త్వరలోనే జక్కన్న అండ్ టీం ఆర్ఆర్ఆర్ పూర్త వివరాలను ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. 

స్వాతంత్ర సమరయోధులు అల్లూరి, కొమరం భీం పాత్రల్లో రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిన టైంలో స్నేహితులు అయివుంటే ఎలా ఉంటుంది అనే ఊహతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, సముద్రఖని.. ఇంగ్లీష్ నటులు అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

 

click me!