Baahubali 3: బాహుబలి 3పై అదిరిపోయే అప్‌ డేట్‌.. అనుష్క, రానాతో కలిసి హింట్‌ ఇచ్చిన ప్రభాస్‌

Published : Jun 26, 2026, 10:13 PM IST
Baahubali

సారాంశం

Baahubali 3: ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలికి మూడో భాగం వస్తుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన 'బాహుబలి: ది టార్చ్‌బేరర్' డాక్యుమెంటరీలోని ఓ వీడియో క్లిప్ ఈ చర్చకు కారణమైంది.

వైరల్‌గా మారిన బాహుబలి ది టార్చ్ బేరర్‌ డాక్యుమెంటరీ 

ఇండియన్ సినిమా గతిని మార్చేసిన ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన మూవీ 'బాహుబలి'. ఈ ఫ్రాంచైజీకి మూడో భాగం రాబోతోందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మేకింగ్, కథతోనే కాదు, బాక్సాఫీస్ రికార్డులతోనూ చరిత్ర సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ రానుందనే ప్రచారానికి ఓ వీడియో క్లిప్ కారణమైంది. నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ అనే డాక్యుమెంటరీలోని ఓ వీడియోనే ఈ చర్చకు దారితీసింది.

బాహుబలి 3పై హింట్‌ ఇచ్చిన ప్రభాస్‌

ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కూడా ఉన్నారు. దీని చివరిలో ఉన్న ఓ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రానా... "ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు, కానీ బాహుబలి ఉంటాడు" అని అంటాడు. అది వినగానే ప్రభాస్ నవ్వుతూ మూడు వేళ్లు చూపిస్తాడు. వెంటనే అనుష్క, రానా ఇద్దరూ ప్రభాస్ చేతిని కిందకు దించేస్తారు. ఆ తర్వాత స్క్రీన్‌పై 'ది లెగసీ కంటిన్యూస్' అని రాసి ఉంటుంది. దీంతో బాహుబలి 3 కచ్చితంగా వస్తుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే, మేకర్స్ నుంచి గానీ, రాజమౌళి నుంచి గానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

నెట్‌ ఫ్లిక్స్ లో బాహుబలి ది టార్చ్ బేరర్‌ డాక్యుమెంటరీ 

‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ డాక్యుమెంటరీ ఈరోజే (జూన్ 26, 2026) నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. మొత్తం నాలుగు ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్‌లో, బాహుబలి ఫ్రాంచైజీని ఎలా రూపొందించారు, అది ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద విజయం ఎలా సాధించింది అనే విషయాలను చూపించారు. తెర వెనుక దృశ్యాలు, నటీనటులతో ఇంటర్వ్యూలు, సెట్‌లోని సరదా క్షణాలు అన్నీ ఇందులో ఉన్నాయి.

2015లో 'బాహుబలి: ది బిగినింగ్' రిలీజైంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను  మొత్తం ఆరు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఫైనల్‌గా ఈ సినిమా రూ. 650 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2017లో వచ్చిన రెండో భాగం 'బాహుబలి: ది కన్‌క్లూజన్' అయితే ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Heroes Lady Getup: లేడీ గెటప్స్‌లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే
AK47: వెంకటేష్‌, త్రివిక్రమ్‌ మూవీ రీ షూట్.. `ఆదర్శ కుటుంబం` దానికి కాపీనా, రీమేకా?