Obsession: అబ్సెషన్‌ ఇండియా కలెక్షన్లు చూసి డైరెక్టర్ షాక్.. 7 కోట్ల సినిమాకి రూ. 2240 కోట్ల కలెక్షన్లు

Published : Jun 25, 2026, 01:34 PM IST
Obsession movie

సారాంశం

Obsession: `కంటెంట్ ఈజ్ కింగ్` అనే మాటను 'అబ్సెషన్' సినిమా మరోసారి నిజం చేసింది. సినిమా తీయడానికి కోట్లు అవసరం లేదు, బలమైన కథ, కథనం ఉంటే చాలని  నిరూపించింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 2240 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియాలో  ఈ సినిమా ఎంత వసూలు చేసిందో తెలుసా?

 'అబ్సెషన్' దెబ్బకు బాక్సాఫీస్ షేక్!

సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడితే, ఎలాంటి అంచనాలు లేకుండా చాలా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ అద్భుతాన్నే చేసి చూపించింది హాలీవుడ్ మూవీ 'అబ్సెషన్' (Obsession). ఈ సినిమా సక్సెస్ ఎంత పెద్దదంటే, దీని కలెక్షన్ల రిపోర్ట్ చూసి స్వయంగా డైరెక్టరే షాక్ అయ్యారు!

బడ్జెట్‌కు 300 రెట్లు ఎక్కువ వసూళ్లు!

సాధారణంగా పెద్ద బడ్జెట్ సినిమాలు 1000 కోట్లు వసూలు చేస్తేనే పెద్ద వార్త అవుతుంది. కానీ, కేవలం 7 కోట్ల రూపాయల (సుమారు 1 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన 'అబ్సెషన్', ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2,240 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. 'బాక్స్ ఆఫీస్ మోజో' లెక్కల ప్రకారం, ఈ హారర్ థ్రిల్లర్ సినిమా కేవలం 26 రోజుల్లోనే ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసింది.

ఇండియాలో 'అబ్సెషన్' క్రేజ్ 

హాలీవుడ్ సినిమాలు ఇండియాలో హిట్ అవ్వడం కొత్తేమీ కాదు. కానీ, ఒక చిన్న బడ్జెట్ థ్రిల్లర్ సినిమా ఇక్కడ 78 కోట్ల రూపాయలు వసూలు చేయడం సాధారణ విషయం కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కలెక్షన్లలో ఒక్క కర్ణాటక నుంచే రూ.20 కోట్లకు పైగా వాటా ఉంది. తెలుగులో ఇది రూ.12కోట్లు రాబట్టింది. సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి   మీమ్స్‌తో హోరెత్తిపోతోంది.

డైరెక్టర్ కర్రీ బార్కర్ ఏమన్నారంటే?

తన సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని డైరెక్టర్ కర్రీ బార్కర్ (Curry Barker) కూడా ఊహించలేకపోయారు. `మేము ఈ సినిమాను చాలా తక్కువ వనరులతో, చిన్న స్థాయిలో తీశాం. భారత్ లాంటి దేశంలో మా సినిమాను ఇంతలా ఆదరిస్తారని కలలో కూడా అనుకోలేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు మాటలు రావడం లేదు` అంటూ కర్రీ బార్కర్ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

అబ్సెషన్‌ రికార్డుల సునామీ!

'ఫోకస్ ఫీచర్స్' స్టూడియో చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'అబ్సెషన్' నిలిచింది. అమెరికాలో నాలుగో వారాంతంలో కూడా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూ హారర్ జానర్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొత్తం మీద,  `కంటెంట్ ఉంటే చాలు, కోట్లు అవసరం లేదు` అని 'అబ్సెషన్' సినిమా మరోసారి బలంగా చెప్పింది. మంచి కథ, కథనం ఉంటే ఎలాంటి సినిమా అయినా అద్భుతాలు చేయగలదని ఇది నిరూపించింది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Youtuber Shanmukh Jaswanth: పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యింది?
OG2: ఓజీ 2 కథ ఇదే, సుజీత్‌కి డేట్స్ ఇచ్చేసిన పవన్‌.. ఈ సారి ఎంత ఊహించుకున్నా తక్కువే