
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan), తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ఫొటోను పంచుకుంది. ఈ ఫొటోలో త్రిష, విజయ్, బర్త్‌డే కేక్ ఉన్నాయి. ఈ ఫొటోతో పాటు, "అన్నింటినీ సార్ధకం చేసే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు (To the person who makes it all worth it), HBD ❤️" అని త్రిష రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అభిమానులు ఈ ఫొటో, దాని క్యాప్షన్ గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అదే సమయంలో అనేక ప్రశ్నలకు సమాధానం, అనేక సెటైర్లకి కౌంటర్ గా, రూమర్లకి క్లారిటీగా నిలచింది.
నటుడు విజయ్ నిన్ననే (జూన్ 22) తన 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వేడుక ముగిసిన ఒక్క రోజుకే, నటి త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో విజయ్, త్రిష స్నేహం మధ్య రిలేషన్ చెడిందా? బ్రేకప్ అయ్యిందా అనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఈ వార్తకు చెక్ పెడుతూ ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది త్రిష.
ప్రతి సంవత్సరం విజయ్ పుట్టినరోజున అందరికంటే ముందుగా స్పెషల్ పోస్ట్ పెట్టే త్రిష, ఈసారి ఎలాంటి విష్ చేయలేదు. ఈ ఏడాది విజయ్ పుట్టినరోజున త్రిష అకౌంట్ నుంచి ఎలాంటి శుభాకాంక్షల పోస్ట్ రాకపోవడంతో, వాళ్లిద్దరి మధ్య సంబంధంలో ఏదో తేడా వచ్చిందని అభిమానులు తలలు పట్టుకున్నారు. అన్‌ఫాలో చేసిందనే వార్తతో, వారిద్దరి మధ్య ఉన్న దీర్ఘకాల స్నేహానికి ఫుల్‌స్టాప్ పెట్టి బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయింది. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నీ తలకిందులయ్యాయి.
ఇప్పుడు, నటి త్రిష కృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్) లో విజయ్‌తో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి, చాలా స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఒక్క పోస్ట్‌తో ఉదయం నుంచి వ్యాపిస్తున్న బ్రేకప్ రూమర్లకి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది. త్రిష పెట్టిన ఈ ట్వీట్ (X) ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం విజయ్, తన భార్య మధ్య విడాకుల కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే విజయ్ సీఎం కావడంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిషకి ఆయన లేట్‌గా టైమ్ ఇచ్చినట్టు ఈ ఫోటోని బట్టి తెలుస్తోంది. కానీ వీరిద్దరు మాత్రమే ఏకంతంగా ఉన్న ఈ ఫోటో సరికొత్త చర్చకు తెరలేపుతోంది. వీరి రిలేషన్‌కిది నిదర్శనంగా నిలుస్తోంది.