‘ఆదిపురుష్’ డైరెక్టర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తిట్ల పురాణం.. ఎందుకంత కోపంగా ఉన్నారంటే?

By Asianet News  |  First Published Mar 28, 2023, 5:50 PM IST

ప్రభాస్ ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) మళ్లీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించారు. ఆయన చేసిన పనికి అభిమానులు మండిపడుతున్నారు. నెట్టింట తిట్ల పురాణంతో దుమారం రేపుతున్నారు. 
 


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాల కోసం ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారు. చివరిగా ‘రాధే శ్యామ్’తో అప్సెట్ చేయడంతో ‘ఆదిపురుష్’తోనైనా ఖుషీ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ గతంలో ఇచ్చిన అప్డేట్స్ తో డైరెక్టర్ ఓం రౌత్ డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయారు. గతేడాది వచ్చిన ‘ఆదిపురుష్’ ట్రైలర్ చాలా డిజపాయింట్ చేసింది. విజువల్స్, క్యారెక్టర్స్ ను చూపించే తీరు ఏమాత్రం నచ్చకపోవడంతో ఫ్యాన్స్ అప్పుడు గట్టిగానే ఏసుకున్నారు. 

అభిమానులు దెబ్బకు మళ్లీ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ సమయంలో మరింత బెస్ట్ విజువల్స్ ను అందించేందుకు కొత్త టీమ్ తో వర్క్ చేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించే పనిలో ఉన్నారు. అయితే ‘ఆదిపురుష్’ ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూనే వస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఎట్టకేళకు ఈ ఏడాది జూన్ 16న విడుదల చేయబోతుండటం కాస్తా ప్రశాంతంగానే ఉన్నారు. 

Latest Videos

ఈ క్రమంలో టీ-సిరీస్ ‘ఆదిపురుష్’పై పెట్టిన పోస్టుకు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆ పోస్టులో కేవలం వేష్ణో దేవీ అమ్మవారిని దర్శించుకున్నామని చెప్పారే గానీ.. ‘ఆదిపురుష్’ నుంచి శ్రీరామ నవమి సందర్భంగా ఏదైనా అప్డేట్ ఇస్తారా? అన్నది చెప్పలేదు. కేవలం దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ ఉన్న ఫొటోను పంచుకున్నారు. దీంతో డార్లింగ్ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. 

అప్డేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తుంటే.. ఇలా మీ ఫొటోలు పెట్టుకుంటారేంటీ? అంటూ కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా అప్డేట్ ఇవ్వండంటూ ఇప్పటికే రెండ్రోజులుగా నెట్టింట అడుగుతూనే ఉన్నారు. టీమ్ తీరుపై చాలా కోపంగా ఉన్నారు. ఈక్రమంలో ఓం రౌత్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఖాళీపోస్టు పెట్టడం పట్ల చాలా అప్సెట్ అవుతున్నారు. ఇంతకీ ఫ్యాన్స్ కోరిక మేరకు శ్రీరామ నవమికి ఏదైనా అప్డేట్ వస్తుందో? లేదో చూడాలి. 

*To a Mangalkaari Shurwaat!*
Seeking divine blessings at Vaishno Devi 🙏 releases IN THEATRES on June 16, 2023 in 3D. pic.twitter.com/V0d3j3boL1

— T-Series (@TSeries)
click me!