ఎట్టకేలకు దానయ్యకు గుర్తింపు... రాజమౌళి మరచినా పెద్ద మనసు చేసుకున్న చిరు!

By Sambi ReddyFirst Published Mar 28, 2023, 5:41 PM IST
Highlights


ఎట్టకేలకు ఆర్ ఆర్ ఆర్ నిర్మాతను గుర్తించారు. దర్శకుడు రాజమౌళితో పాటు ఆయన్ని కూడా సత్కరించారు. 
 

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలుచుకోగా ఆ చిత్ర నిర్మాత గురించి కనీస ప్రస్తావన లేదు. ఈ క్రమంలో రాజమౌళితో డివివి దానయ్యకు విబేధాలని వార్తలు వచ్చాయి. ఆర్ ఆ ఆర్ మూవీ ఆస్కార్ క్యాంపైన్ కోసం రాజమౌళి నిర్మాత దానయ్యను డబ్బులు అడిగారని, ఇవ్వనని చెప్పడంతో ఆయన్ని పక్కన పెట్టేశారని కథనాలు వెలువడ్డాయి. ఆర్ ఆర్ ఆర్ అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డ్స్ తో పాటు అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. రాజమౌళితో కానీ  ఆర్ ఆర్ ఆర్ టీమ్ కానీ ఎక్కడా దానయ్యకు క్రెడిట్ ఇవ్వలేదు. ఏ ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావన తేలేదు. 

రాజమౌళితో విబేధాలన్న వార్తలపై నిర్మాత దానయ్య స్పందించారు. నాకు ప్రచారం అంటే నచ్చదు. అందుకే ఆస్కార్ కి వెళ్ళలేదు. అంతే కానీ రాజమౌళితో నాకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టత ఇచ్చారు. అమెరికా నుండి ఇండియాకు వచ్చాక కూడా దానయ్యను ఆర్ ఆర్ ఆర్ టీమ్ కలిసింది లేదు. అయితే ఎట్టకేలకు దానయ్య-ఆర్ ఆర్ ఆర్ టీం ఒకచోటకు చేరారు. దానికి రామ్ చరణ్ బర్త్ డే వేదికైంది. 

ఎన్నడూ లేని విధంగా రామ్ చరణ్ బర్త్ డే ఘనంగా నిర్వహించారు. మార్చి 27 రాత్రి చిరంజీవి నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించారు. గౌరవించాలనే ఆలోచనతోనే చిరంజీవి వాళ్లకు చరణ్ బర్త్ డే పార్టీ ఇన్విటేషన్ పంపారు.  

రాజమౌళితో పాటు కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ లను చిరంజీవి సత్కరించారు. పనిలో పనిగా డివివి దానయ్యకు శాలువా కప్పి పూలగుచ్ఛం ఇచ్చారు. దీంతో రాజమౌళి మరచినా కనీసం చిరంజీవి గుర్తించారని సోషల్ మీడియా జనాలు చెప్పుకుంటున్నారు. కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు చిరంజీవే అసలు నిర్మాత, దానయ్య పేరుకు మాత్రమే నిర్మాత అని ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. దీన్ని దానయ్య ఖండించారు. 

click me!