తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన ఇంట్లో సీక్రెట్ గా పూజలు నిర్వహించింది. వేణు స్వామి పూజలు జరిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తాజాగా తన ఇంట్లో సీక్రెట్ గా పూజలు నిర్వహించింది. సెలెబ్రెటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఆధ్వర్యంలో రాజ శ్యామల పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియో వైరల్ అవుతోంది. తెలుగు బ్యూటీ ట్రెడిషనల్ దుస్తుల్లో ఆధ్యాత్మిక భావనతో మెరియడం విశేషం. అయితే, ఉన్నట్టుండి నిధి అగర్వాల్ ఇంట్లో పూజలు ఎందుకు నిర్వహించారనేది ప్రస్తుతం అభిమానులు సందేహంగా మారింది.
కాగా, నిధి అగర్వాల్ కు ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేకపోవడం బాధాకరం. ఇప్పుడిప్పుడే తన కేరీర్ ను మళ్లీ చక్కదిద్దుకుంటోంది. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. దీనికోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది నిధి అగర్వాల్. అందులో భాగంగానే తాజాగా ఇంట్లో పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. గతంలో రష్మిక మందన్న వేణు స్వామితో పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి వరుస హిట్లతో ఇండస్ట్రీలో దుమ్ములేపుతుంది. ఈ క్రమంలో నిధి అగర్వాల్ కు కూడా మంచి జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
హైదరాబాద్ కు చెందిన హీరోయిన్ నిధి అగర్వాల్ ఐదారేండ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తొలుత హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’తో హీరోయిన్ గా కేరీర్ ను ప్రారంభించింది. తన డాన్స్, నటనతో ఆకట్టుకుంది. ఆ వెంటనే అక్కినేని నాగచైతన్య సరసన ‘సావ్యసాచీ’లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అప్పటి నుంచి తెలుగు, తమిళ చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. నిధికి ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి హిట్ పడింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అలా అలా థియేటర్లలో సందడి చేసి వెళ్లాయి.
చివరిగా నిధి అగర్వాల్ ‘హీరో’ చిత్రంతో అలరించింది. ఈ సినిమా అంతంత మాత్రనే ఆడింది. ప్రస్తుతం నిధి చేతిలో ఉన్న ఏకైక బిగ్ ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తొలిసారిగా నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్మోస్ట్ చిత్రం తుదిదశకు చేరుకుంది. దీంతో నిధి అగర్వాల్ ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. పలు మార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం.. మార్చి 30న విడుదల కావాల్సింది. కానీ మళ్లీ డీలే అవుతోంది. మళ్లీ రిలీజ్ డేట్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.