పెళ్లి సందడి అంతా ప్రభాస్, అనుష్కలదే!

Published : Dec 29, 2018, 11:18 AM ISTUpdated : Dec 29, 2018, 11:19 AM IST
పెళ్లి సందడి అంతా ప్రభాస్, అనుష్కలదే!

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జైపూర్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది స్టార్లు జైపూర్ చేరుకున్నారు. అందరికంటే ముందుగా ప్రభాస్-అనుష్క జైపూర్ కి చేరుకున్నారు. 

దర్శకధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జైపూర్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది స్టార్లు జైపూర్ చేరుకున్నారు. అందరికంటే ముందుగా ప్రభాస్-అనుష్క జైపూర్ కి చేరుకున్నారు.

టాలీవుడ్ ప్రముఖులను రిసీవ్ చేసుకోవడం, వారికి కావాల్సిన ఏర్పాటు చూడడం వంటివి ఈ జంట దగ్గరుండి చూసుకుంటుందట. ఈవిషయంలో రాజమౌళికి సహాయం చేస్తూ మరోపక్క ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రభాస్-అనుష్క రాజస్థానీ సంప్రదాయంలో బట్టలు వేసుకొని డాన్స్ చేస్తోన్న ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ఇద్దరూ కలిసి పెళ్లిలో సందడి చేస్తుండడంతో మరోసారి ఈ జంట ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పెళ్లికి వచ్చిన చాలా మంది ఈ జంటని ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా.. రీసెంట్ గా ప్రభాస్ ఓ టాక్ షోలో అనుష్క తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని క్లారిటీ ఇచ్చాడు. కానీ టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ ఎవరంటే అనుష్క పేరే చెప్పారు. 

రాజమౌళి కొడుకు పెళ్లి.. అతిథులు వీళ్లే..!

రాజమౌళి కొడుకు పెళ్లి.. చరణ్, ఎన్టీఆర్ వాలిపోయారు!

PREV
click me!

Recommended Stories

Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్