కరణ్ బాహుబలి2 సక్సెస్ పార్టీలో ప్రభాస్ హంగామా

First Published Jun 20, 2017, 2:03 PM IST
Highlights
  • బాహుబలి2 బాలీవుడ్ రిలీజ్ తో వంద కోట్లకు పైగా లాభాలు ఆర్జించిన కరణ్ జోహార్
  • బాహుబలి2 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో ఫ్రెండ్స్ కు పార్టీ
  • కరణ్ పార్టీకి హాజరైన బాహుబలి ప్రభాస్, భల్లా రానా 

బాహుబలి-2ను హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ సినిమా ఘన విజయం సాధించడంతో.. భారీ పార్టీ ఇచ్చాడు. బాహుబలి ది బిగినింగ్ సినిమా 2015లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినప్పుడు బాలీవుడ్ సినీ జనాలకు, బాంబే సెలెబ్రిటీలకు ప్రభాస్ ఎవరా అనుకున్నారు. అప్పటికే రాజమౌళి అంటే మగధీర, ఈగ చిత్రాల ద్వారా బాలీవుడ్‌కు పరిచయమే కానీ.. ఒక తెలుగు కుర్ర హీరో ఇంత గొప్ప విజయం సాధించడం ఏంటి అనే ఆసక్తి బాలీవుడ్ సెలెబ్రిటీస్‌లో కలిగింది. కానీ బాహుబలి ది కంక్లూజన్ విడుదల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన బాహుబలి... ప్రభాస్ అంటే ఎవరో అందరికీ తెలిసేలా చేసింది.

 

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన 20 ఏళ్ల సినీ జీవింలోనే కనీవినీ ఎరుగని విజయాన్ని బాహుబలి-2 చిత్రం ద్వారా సాధించారు. కేవలం 125 కోట్ల రూపాయలకు బాలీవుడ్ రైట్స్ కొనుక్కున్న కరణ్ ఇప్పటికే ఈ సినిమా ఒక్క హిందీ ప్రాంతంలోనే 300 కోట్లకు చేరుకోవడంతో తెగ సంబరపడిపోతున్నారు.

 

బాలీవుడ్ కల్లో కూడా ఊహించని విజయం సాధించిన కరణ్ బాలీవుడ్‌కు భారీ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుని.. పార్టీకి బాలీవుడ్ ప్రముఖులతో పాటు ప్రముఖ మీడియా ప్రతినిధులను కూడా కరణ్ పెద్ద స్థాయిలో ఆహ్వానం పంపాడు. కానీ మొదట ప్రభాస్ ఈ పార్టీ కి వెళ్ళనని చెప్పేసాడు. నిజానికి ప్రభాస్ చాలా బిడియస్తుడు. పైగా పార్టీ కల్చర్‌కు అతడు చాలా దూరంగా ఉంటాడు. ఆడపిల్లలతో మాట్లాడటం అన్నా, పదిమంది కూడిన చోట మాట్లాడాలన్నా ప్రభాస్ బాగా సిగ్గుపడతాడని చాలాసార్లు అనుభవమైంది.

 

ఇక మామూలుగానే ఇలా ఉండే ప్రభాస్.. బాలీవుడ్ సెలబ్రిటీస్ సమక్షంలో మాట్లాడటం అసంభవం అని తన సన్నిహితులు చెప్పారు. పైగా రానాతో పోల్చుకుంటే అటు ఇంగ్లీషులో, ఇటు హిందీలో కూడా ప్రభాస్ పెద్దగా మాట్లాడలేడు. దీంతో తనలో తొలి నుంచి ఉన్న ఈ బిడియం, దానికి తోడు భాషా సమస్య కూడా ప్రభాస్‌ను సెలబ్రిటీలు ఉన్న పార్టీలకు దూరం చేస్తోందని చెప్పారు గానీ చివరాఖరికి ఆ పార్టీలో ప్రభాస్ అడుగు పెట్టేసాడు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌రుణ్ ధావ‌న్, అలియాభ‌ట్, ర‌ణ‌బీర్ క‌పూర్, రానా, ప్ర‌భాస్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

 

ముఖ్యంగా క‌ర‌ణ్... కొద్ది రోజులుగా యూఎస్ హాలీడే ట్రిప్ వెళ్లి ఇండియాకి వ‌చ్చిన ప్ర‌భాస్ కోస‌మే ఈ పార్టీ ఏర్పాటు చేశాడ‌ని అంటున్నారు. తార‌లు అంద‌రు క‌లిసి స‌ర‌దాగా పార్టీలో సంద‌డి చేసిన వేళ‌, ప్ర‌భాస్ ని ప‌లువురు సెల‌బ్రిటీలు ప్ర‌శంసించ‌డంతో పాటు, ఆయ‌న త‌దుపరి చిత్రం సాహో కోసం ఎదురు చూస్తున్నామ‌ని చెప్పార‌ట‌.

ప్ర‌స్తుతం కరణ్ బాహుబలి పార్టీ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ లెక్కన ప్రభాస్ బాలీవుడ్ లోకి ఎంటరై పోవటానికి గ్రాండ్ వెల్కం లభించిందనే అనుకోవాలి.

click me!