వారసుడి కోసం ఇంట్లో ప్రెజర్ పెరిగిందని చెప్పకనే చెప్తున్న రామ్ చరణ్

Published : Jun 20, 2017, 10:12 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
వారసుడి కోసం ఇంట్లో ప్రెజర్ పెరిగిందని చెప్పకనే చెప్తున్న రామ్ చరణ్

సారాంశం

రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లై ఐదేళ్లు పూర్తి ఇంకా వారసున్నివ్వని మెగా కోడలు ఉపాసన వారసుని కోసం నాన్న ఇకపై ప్రెజర్ పెడతారేమో అంటున్న చెర్రీ

రామ్ చరణ్- ఉపాసన దంపతులకు వివాహం జరిగి ఐదేళ్లయిపోయింది. అయితే మెగా అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నా... ఇంకా బుల్లి మెగా వారసుడు అతను తండ్రి కాలేదు. పోయినేడాదే చరణ్ తండ్రి కాబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ వాటిని చరణ్ ఖండించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడాడు చరణ్. వారసులు కావాలంటూ ఇప్పటిదాకా ఇంట్లో తమ మీద ప్రెజర్ ఏమీ లేదన్నాడు చరణ్. ఐతే భవిష్యత్తులో తన తండ్రి వారసుల కోసం అడగొచ్చేమో అని చరణ్ వ్యాఖ్యానించాడు.



ఇక ఉపాసనతో తన ప్రేమ, పెళ్లి గురించి స్పందిస్తూ.. తనతో ప్రేమ సంగతి పెళ్లికి ఎనిమిది నెలల ముందు తన తండ్రికి చెప్పానన్నాడు. వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకున్నారా అని ఒకటే మాట అడిగారని.. ఔననగానే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చరణ్ వెల్లడించాడు.

 

ఇక తమ తల్లిదండ్రుల వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. "మా అమ్మ మోస్ట్‌ హ్యాపియెస్ట్‌ లేడీ. నాన్న 30-40 మంది హీరోయిన్లతో పనిచేశారు. కానీ అమ్మను ఎప్పుడూ ఇబ్బంది పడనివ్వలేదు. అమ్మ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. సుహాసిని, రాధ, సుమలత లాంటి చాలామంది హీరోయిన్లతో చాలా సినిమాలు చేశారు. వాళ్లందరూ కూడా అమ్మతో బాగా మాట్లాడతారు. హీరోయిన్ల విషయంలో నాన్న నాకు కూడా కొన్ని సలహాలిచ్చారు" అని చరణ్ తెలిపాడు.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి