ఇక నేను వెయిట్ చేయలేనంటున్న సానియా మీర్జా.. త్వరలో వెండితెరపై

Published : Jun 20, 2017, 11:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఇక నేను వెయిట్ చేయలేనంటున్న సానియా మీర్జా.. త్వరలో వెండితెరపై

సారాంశం

త్వరలో సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్న సానియా మీర్జా ఫీచర్ ఫిల్మ్ లో సానియా అంటూ ట్వీట్ చేసిన ఫర్హాన్ అక్తర్ ఫర్హాన్ ట్వీట్ కు రిప్లైగా ఇంక నేను వెయిట్ చేయలేను..అని పేర్కొన్న సానియా

ఇండియన్ ఏస్ టెన్నిస్ మహిళల స్టార్ సానియా మీర్జా మనకు ఇప్పటిదాకా టెన్నిస్ స్టార్ గా మాత్రమే తెలుసు. అడపా దడపా ఫ్యాషన్ షోలలో షోస్టాపర్ గా అందాల తారలా మెరుస్తూ కనిపించినా.. వెండితెరపై సానియాను చూడాలనే అభిమానుల కోరిక మాత్రం దోబూచులాడుతూనే ఉంది.

అయితే ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాల్లో పెద్దగా నటించకున్నా.. సానియా టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ సెలబ్రిటీలతోనూ చాలా క్లోజ్ గా ఉంటుంది. సినిమా వాళ్లంటే సానియాకు కాస్త ఆసక్తి ఎక్కువే. ఇక ఈ టెన్నిస్ బ్యూటీ త్వరలో వెండితెరపై కనిపించబోతోంది. ఈ మేరకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అక్తర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

 

త్వరలో సానియా మీర్జా, ఆదర్శవంతులైన ఆమె తండ్రిని ఫీచర్‌ చేస్తూ ఓ సినిమా రాబోతోంది అంటూ పర్హాన్ ట్వీట్ చేశారు. పర్హాన్ అక్తర్ ట్వీటుపై సానియా మీర్జా స్పందిస్తూ.. ఇది నాకు ఎంతో స్పెషల్, ఎక్కువ వెయిట్ చేయడం నా వల్ల కాదు అంటూ రిప్లై ఇచ్చారు.

 

అయితే ఈ ఫిలింలో ఏముంది, దీనికి సంబంధించిన ఇతర విషయాలేంటి అన్నది ఇంకా వెల్లడించలేదు. 'మెన్ ఎగెనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ (ఎంఏఆర్‌డీ) ప్రచారంలో భాగంగా ఈ సినిమా ఉండొచ్చని సమాచారం.

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం