ఎట్టకేలకు కలిసిపోయిన పవన్‌ కళ్యాణ్‌, అలీ.. వీడియో వైరల్‌

Published : Feb 21, 2021, 04:26 PM IST
ఎట్టకేలకు కలిసిపోయిన పవన్‌ కళ్యాణ్‌, అలీ.. వీడియో వైరల్‌

సారాంశం

తన ప్రతి సినిమాలో అలీ ఉంటాడని, అది మా ఫ్రెండ్‌షిప్‌కి, ప్రేమకి నిదర్శనమని చెప్పాడు పవన్‌. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఏపీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.  ఎలక్షన్‌ టైమ్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 

పవర్‌ స్లార్‌ పవన్ కళ్యాణ్‌, కమేడియన్‌ అలీ ఎంత మంచి ఫ్రెండ్సో అందరికి తెలిసిందే. అలీపై ఉన్న ప్రేమని పవన్‌ అనేక రూపాల్లో చాటుకుంటూ వస్తున్నారు. తన ప్రతి సినిమాలో అలీ ఉంటాడని, అది మా ఫ్రెండ్‌షిప్‌కి, ప్రేమకి నిదర్శనమని చెప్పాడు పవన్‌. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఏపీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 

ఎలక్షన్‌ టైమ్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అలీ మోసం చేశాడనే విషయాన్ని కూడా పలు సందర్భాల్లో పవన్‌ వ్యాఖ్యానించాడు. కానీ తాజాగా వీరిద్దరు కలిసి పోయారు. దీనికి వీరిద్దరు కలిసి దిగిన ఫోటోనే నిదర్శనం. అలీ బంధువుల పెళ్లి వేడుకకి పవన్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరు కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఆ వీడియోని అలీ భార్య జుబేదా సోషల్‌ మీడియాలో పోస్టర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీరి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

అలీ.. ఈటీవీలో `అలీతో సరదాగా` షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు నటుడిగా పలు సినిమాలు చేస్తున్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ నటించిన సినిమా `వకీల్‌ సాబ్‌` విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`, క్రిష్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?