‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాపై ఓవైపు విమర్శలు వస్తున్నా.. వసూళ్ల పరంగా దుమ్ములేపుతోంది. రెండో రోజు కూడా మంచి వసూళ్లను సాధించింది.
తొలిరోజు ‘ఆదిపురుష్’ రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ.140 కోట్లు సాధించి హ్యాయెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూడో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి2‘ తర్వాత Adipurush కు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా రెండోరోజు కలెక్షన్ల వివరాలను కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘ఆదిపురుష్’ చిత్రం జూన్16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఎన్నో విమర్శలు, వివాదాలను దాటుకొని థియేటర్ లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. కానీ కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది. కానీ మొదటి రోజు కంటే తక్కువ మొత్తంలోనే వసూళ్లు అందాయి. తాజాగా యూనిట్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం.. రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘ఆదిపురుష్’ రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
undefined
మొదటి రోజు రూ.140 కోట్లు సాధించగా రెండో రోజు రూ.100 కోట్ల వరకు రాబట్టింది. రెండురోజుల్లో మొత్తంగా రూ.240 కోట్ల గ్రాస్ ను దక్కించుకుంది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు బాగానే ఉన్నాయి. కానీ నెగెటివ్ టాక్ రావడంతో రోజురోజుకు వసూళ్లలో పలుచబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.271 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కావాలంటే రూ.272 కోట్ల వరకు షేరే వసూల్ చేయాల్సి ఉంటుంది.
కొన్ని లెక్కల ప్రకారం రెండో రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
ఏపీ మరియు నైజాం : రూ.75 కోట్లు
తమిళనాడు : రూ.2.20 కోట్లు
కేరళ : రూ.1.10 కోట్లు
కర్ణాటక : 14.32 కోట్లు
ROI : kp.90 కోట్లు
ఓవర్సీస్ : రూ.38 కోట్లు / 4.63 మిలియన్ డాలర్స్ గా వసూళ్లు రాబట్టినట్టు అంచనా వేస్తున్నారు.
ఇక హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) , కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా అలరించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త హనుమంతుడి పాత్రలో ఒదిగిపోయారు. రావణసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ అలరించారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించారు.
Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏
Book your tickets on:… pic.twitter.com/EujfavdLBg