
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో స్ట్రాంగ్ ప్యాన్స్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది.. మాలీవుడ్ బ్యూటీ హనీరోజ్. వీరసింహారెడ్డి సినిమాతో సినిమాతోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది బ్యూటీ. చాలా సినిమాలు చేసి.. చాలా ఇండస్ట్రీలలోపనిచేసినా రాని పేరు ఆమెకు ఈసినిమాతో టాలీవుడ్ లో వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినియాలో ఆడిపాడింది బ్యూటీ. మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు హనీరోజ్.
ఇక ఈసినిమాల ఆమె అందానికి ప్రేక్షకులుఫిదా అయిపోయారు. తెలుగు ఆడియన్స్ ను మంద్ర ముగ్థులను చేసిన ఈసినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అనుకోవాలి. అంతే కాదు అందాలతో కనువిందు చేసుకునే కుర్ర కారుకు చిర్రెత్తించే ఫోజులతో కంటి మీద కునుకు లేకుండా చేసింది బ్యూటీ.
హనీరోజ్ చేసిన ఒక భారీ రిస్క్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. ఇటీవల ఐర్లాండ్ టూర్‌కు వెళ్లిన ఈ తేనెకళ్ల బ్యూటీ.. ఆ కంట్రీలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర్నే స్టోన్ రిస్క్ చేసి మరీ ముద్దు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆమె చాలా ఎత్తులో పడుకొని.. తన తలను బాగా వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని ముద్దాడారు. ఈ అనుభవాన్ని మర్చిపోలేనని.. ఇదొక వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పుకొచ్చారు హనీరోజ్. ప్రస్తుతం ఆవీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హానీరోజ్ నెక్ట్స్ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నన టైమ్ లో.. కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఆమె వెండితెర మీద కనిపించే సూచనలు పెద్దగా కనిపించడం లేదు. వీరసింహారెడ్డి తో హనీరోజ్‌కు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ మాత్రమే వచ్చింది. అవకాశాలు మాత్రం పెద్దగా రావడంలేదు.