రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ రోజురోజుకు విమర్శలను ఎదుర్కొంటోంది. చిత్రంలోని కొన్ని అంశాలపై ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తునే అభిప్రాయాలు వస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హిందువులు ఎంతోగానో గౌరవించే రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం Adipurush. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త హన్మంతుడి పాత్రలో అలరించారు. ఈ చిత్రంలో రావణసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రీడీలోనూ థియేటర్లోల సందడి చేస్తోంది.
అయితే, ఈ చిత్రం మొదటి టీజర్ విడుదలైనప్పటి నుంచి వ్యతిరేకతనే ఎదురవుతోంది. నాసిరకం వీఎఫ్ఎక్స్ తో ఫ్యాన్స్, ఆడియెన్స్ కూడా అప్సెట్ అయ్యారు. దాని కారణంగా గతేడాది ఆగస్టులోనే రావాల్సిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలైంది. రిలీజ్ కు ముందు విడుదల చేసిన ట్రైలర్లతో కాస్తా మంచి రెస్పాన్సే దక్కినా థియేటర్లలో మాత్రం సినిమా పూర్తిగా ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది.
చిత్రంలో రాముడు, సీత, హన్మంతుడు, రావణసురుడి పాత్రలను చూపించిన ఏం బాగోలేదని, అలాగే చిత్రంలో వాడిన కొన్ని డైలాగ్స్ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సంభాషణల విషయంలో కొంతమంది ప్రేక్షకులు సూచనలు చేస్తున్నారు. వారి సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.
ప్రేక్షకుల సూచనలను గౌరవిస్తూ "ఆదిపురుష్" చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మార్చబోతున్నారు. సినిమాలో ఇప్పుడున్న ఫీల్ కొనసాగిస్తూనే ఆ మార్చిన సంభాషణలు ఉంటాయి. కొద్ది రోజుల్లోనే ఈ మార్పులతో థియేటర్స్ లో "ఆదిపురుష్" ను చూడవచ్చు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి విజయం వైపు వెళ్తున్న ఈ చిత్రంలోని డైలాగ్స్ మార్పులు సినిమా టీమ్ కు ఒక సాహసం లాంటిదే అయినా ప్రేక్షకుల మనోభావాలు, సెంటిమెంట్స్, వారి సూచనలు గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యమని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని రచయిత కూడా వెల్లడించారు.
ఇక చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి పక్కనెడితే.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.140 కోట్లు సాధించింది. తెలుగులో రూ.60 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక హిందీ బెల్ట్ లో మరింత రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా రూ.45 కోట్లు కలెక్ట్ అయ్యింది. మున్ముందుకు కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేయబోతుందని తెలుస్తోంది.