‘ఆదిపురుష్’ టీమ్ ఎందుకింత రిస్క్, తేడా కొడితే...?

Published : May 02, 2023, 04:49 PM IST
 ‘ఆదిపురుష్’ టీమ్ ఎందుకింత రిస్క్, తేడా కొడితే...?

సారాంశం

 ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్  తో  సినిమాపై చాలా అనుమానాలు, సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలో సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోతే ఇబ్బంది ...


ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా  నెల పదిహేను రోజులు పైగా సమయం ఉండగా ఇప్పటి నుంచే అంచనాలను పెంచేందుకు దర్శక నిర్మాతలు నడుం బిగించారు.  అయితే అనుకున్న స్దాయిలో క్రేజ్ రావటం లేదు. బిజినెస్ కూడా వేడెక్కలేదని సమాచారం. దాంతో ట్రైలర్ వదిలి ఈ చిత్రానికి నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారని సమాచారం. 

 ప్రమోషన్‌లో భాగంగా మే 9న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో  లేదా భద్రాచలంలో  పెద్ద ఎత్తున జరుపాలని ఫిక్సైనట్లు సమాచారం. ఇక అదే రోజున ట్రైలర్‌ కూడా రానున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ, మరీ సినిమాకు నెల రోజుల ముందే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అంటే.. సినిమా రిలీజ్ టైమ్ దాకా దాన్ని సస్టైన్ చేయగలమా అని సందేహ పడుతున్నారు. పెద్ద సినిమాలకు రిలీజ్  సమయానికి భారీ హైప్‌ ఉండకపోతే ఓపినింగ్స్  సమస్య వస్తుంది. అందులోనూ ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్  తో  సినిమాపై చాలా అనుమానాలు, సమస్యలు ఉన్నాయి. ఈ క్రమంలో సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని పలువురు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు.  అయితే సరైన ట్రైలర్‌ చాలు సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచడానికి అని దర్శక,నిర్మాతలు ఫీలవుతున్నారట. ఈ క్రమంలో  ట్రైలర్‌ను నెల రోజుల ముందే రిలీజ్‌ చేయడం అనే వార్త నిజమైతే రిస్క్ అన్నది కూడా నిజం.   

 బాలీవుడ్ స్టార్ నటి కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. “ఆదిపురుష్ సినిమా అయితే మన దేశపు చరిత్ర రామాయణం ఆధారంగా తెరకెక్కించారు.  ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ అయితే తెరకెక్కించాడు.   ఇప్పటికే విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్ విమర్శలపాలైంది. సరికొత్త టెక్నాలజీ, భారీ గ్రాఫిక్స్‌తో రూపొందిన టీజర్‌ను బుల్లితెరపై చూసి చాలా మంది పెదవి విరిచారు. అయితే, అదే టీజర్‌ను వెండితెరపై 3డీలో చూపి వహ్వా అన్నారు. అయినప్పటికీ ఈసారి ప్రేక్షకుల మతిపోగెట్టేలా ప్రచార కార్యక్రమాలు ఉండాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నారట. అందుకే, ట్రైలర్ ని ఛాలెంజింగ్‌గా తీసుకొని సిద్ధం చేస్తున్నారట. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?