
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సముద్రఖని దర్వకత్వంలో ‘వినోదయసీతమ్’కు రీమేగా రూపుదిద్దుకుంటున్న PKSDTకి సంబంధించిన తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, క్రియేటివ్ డైరెక్టర్ సుజీత్ దర్వకత్వంలో వస్తున్న OGపై ఫోకస్ పెట్టారు.
తాజాగా ‘ఓజీ’ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ అందించి. సినిమాను అనౌన్స్ చేసిన వెంటనే షూటింగ్ ను కూడా ప్రారంభించిన విషయ తెలిసిందే. ఇప్పటికే ముంబైలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. పూణెలో రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఇక ఈ షెడ్యూల్ కూడా పూర్తైనట్టు తాజాగా మేకర్స్ అప్డేట్ అందించారు. చిత్ర సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని ఆసక్తిని పెంచారు. ‘మేము వాగ్దానం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఉద్వేగాన్ని మళ్లీ చూడబోతున్నారు’ అంటూ అప్డేట్ ఇచ్చారు. దీంతో చిత్రంలో ఎంతటి వైలెన్స్ ఉండబోతుందో అర్థం అవుతోంది.
ఇప్పటికే OG సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ లుక్స్ ను పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా వపర్ స్టార్ న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోను కూడా విడుదల చేశారు. బ్లూ కాలర్ టీషర్ట్, మెడలో ఎర్రటి దండ, సన్ గ్లాసెస్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి రెండు షెడ్యూళ్లు పూర్తి కావడంతో మూడో షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడ ప్రారంభం కాబోతుందనేది ఆసక్తికరంగా మారింది. నెక్ట్స్ షెడ్యూల్ లో కొన్నిసీన్స్ హైదరాబాద్ లోనే షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
చిత్రంలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ క్రమంలో ఫస్ట్ అప్డేట్ పై మరింతగా అంచనాలు పెరిగాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లోనూ ‘హరిహర వీరమల్లు’ రూపుద్దుకుంటున్న విషయం తెలిసిందే. చిత్రం నుంచి ప్రస్తుతం ఎలాంటి అప్డేట్స్ లేవు.