ఆ హీరోయిన్ నాగచైతన్య క్రష్.. ‘రీసెంట్’గా అంటూ ఓపెన్ అయిన చైతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

By Asianet News  |  First Published May 2, 2023, 4:43 PM IST

‘కస్టడీ’ చిత్ర ప్రమోషన్స్ లో అక్కినేని నాగచైతన్య ఫుల్ బిజీగా ఉన్నారు.  ఈ సందర్బంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. తాజాగా  తన సీక్రెట్ క్రష్ గురించి వెల్లడించారు. 
 


అక్కినేని నటవారసుడు నాగచైతన్య (Naga Chaitanya) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కస్టడీ’ Custody. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కేరీర్ లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో చైతూ అలరించబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపుదిద్దుకుంటోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా పదిరోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే, ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైతూ ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆకస్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నారు. డివోర్స్ తర్వాత సినిమాల విషయాల్లో ప్రశ్చాత్తాపంగా ఫీలయ్యారని చెప్పారు. ఈక్రమంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో తన సీక్రెట్ క్రష్ ఎవరంటూ ప్రశ్న ఎదురైంది.  దీనికి చైతూ ఇలా బదులిచ్చాడు.

Latest Videos

చైతూ మాట్లాడుతూ.. ‘సీక్రెట్ క్రష్ ఎవరూ లేదు. నాకు క్రష్ ఉన్నప్పుడు నేను బహిరంగంగా ఒప్పుకోగలను. నేను ఈ మధ్యనే బాబిలోన్ (Babylone) అనే హాలీవుడ్ ఫిల్మ్ చూశాను. అందులో యాక్ట్రెస్ ‘మార్గోట్ రాబీ’ (Margot Robbie) నటన నాకు బాగా నచ్చింది. కాబట్టి నేను ఆమె పెర్ఫామెన్స్ పరంగా ఇష్టపడుతున్నాను. అలా ఆమెపై క్రష్ అని చెప్పొచ్చు. ’ అని చెప్పుకొచ్చారు. 

సమంతతో నాగచైతన్య డివోర్స్ తీసుకున్న తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్’ నటి శోభితా ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లోనూ చైతూకు ఆ తరహా ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఆసక్తికరంగా బదులిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ‘కస్టడీ’లో  చైతూకు జోడీగా కృతి శెట్టి ఆడిపాడింది.  ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించారు. శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషిస్తున్నారు. మే5న ట్రైలర్ విడుదల కాబోతోంది. మే12 చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. 

click me!