అన్నయ్య సినిమా చూసిన తమ్ముడు

Published : Jan 13, 2017, 12:08 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అన్నయ్య సినిమా చూసిన తమ్ముడు

సారాంశం

మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 మూవీ చూసిన పవన్ పవన్ అన్నయ్య మూవీ చూశాడని తెలిసి సంబరపడుతున్న మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ లోనూ ఆనందోత్సాహాలు బాక్సాఫీస్ వద్ద బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చి కుమ్మేస్తున్న మెగాస్టార్  

ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కాకుండా మెగా అభిమానులను కొందరిని నిరాశ పరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యపై గౌరవాన్ని మరోలా చాటుకున్నాడు. అన్నయ్య సినిమా ఖైదీ నెంబర్ 150 ని పవన్ కళ్యాణ్ చూసేశాడట.

మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చూసాడు. రిలీజ్ అయిన మొదటి రోజునే ప్రపంచ వ్యాప్తంగా ఖైదీ నెంబర్ 150   47 కోట్ల భారీ వసూళ్ల ని సాధించి సంచలనం సృష్టించింది. పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి వస్తుండటంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ గోల గోల చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ . అభిమానులు ఉత్సాహం , ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన బాస్ చిత్రం బాక్సాఫీస్ ని కుమ్మేస్తోంది.

 

ఇక పవన్ విషయానికి వస్తే ప్రీ రిలీజ్ వేడుకకు రాలేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు కానీ ఇప్పుడు పవన్ సినిమా చూసాడని తెలుసుకొని చాలా సంతోషిస్తున్నారు . పవన్ సినిమా చూసాడు అన్న వార్త అంతటా వ్యాపించింది. దాంతో మెగా కుటుంబం మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటేనని సంతోషంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.

PREV
click me!

Recommended Stories

కాంట్రవర్షియల్ మూవీ జాతీయ అవార్డు కొట్టిన నటి.. కెరీర్ ని నిలబెట్టిన సినిమాలు ఇవే
కలా నిజమా..చిరంజీవి కోసం నయనతార తనంతట తానుగా వచ్చి.. అనిల్ రావిపూడికి మతిపోయింది