శాతకర్ణి షూటింగులో క్రిష్ తలపట్టుకునేలా చేసిన ముగ్గురు

Published : Jan 13, 2017, 11:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
శాతకర్ణి షూటింగులో క్రిష్  తలపట్టుకునేలా చేసిన ముగ్గురు

సారాంశం

క్రిష్ కు షూటింగ్ సందర్భంగా తలనొప్పి తెచ్చిన ముగ్గురు ముగ్గురూ ముగ్గురే అంటూ తలపట్డుకున్న క్రిష్ షూటింగ్ లో చిన్న పిల్లల్లా ప్రవర్తించారంటున్న క్రిష్ క్రిష్ చెప్తున్న ఆ ముగ్గురే బాలకృష్ణ, శ్రియ, హేమామాలిని

సంక్రాంతి పండుగ వేళ తెలుగు వెండితెరపై నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి న్యూస్ క్రియేట్ చేస్తోంది. శాతకర్ణి దర్శకుడు క్రిష్ ఈ సినిమా షూటింగ్ విశేషాలను మీడియాతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు. రిలీజ్ రేపుందనగా.. బాలయ్య మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వ్యవహరించిన తీరు చూస్తే క్రిష్ చెప్పిన మాటలు నిజమనిపిస్తుంది. ఇంతకీ క్రిష్ చెప్పిందేంటి. మనం నమ్మాల్సిందేంటి.

 

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజ దర్శకులెందరో ప్రశంసలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశంసలకు నిజమైన అర్హత ఆ చిత్ర యూనిట్ అంతటికీ ఉందనే చెప్పాలి. దర్శకుడు క్రిష్ సినిమా షూటింగ్ విశేషాలు పంచుకుంటూ.. హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రియ, గౌతమి పాత్రలో నటించిన బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ ఈ ముగ్గురూ చిన్న పిల్లల కంటే దారుణంగా ప్రవర్తించారట. షూటింగ్ లో సీరియస్ గా షాట్ కోసం అటెన్షన్ క్రియేట్ చేస్తున్నా... శ్రియ, హేమా మాలినిలు, చివరకు హీరో బాలకృష్ణ కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి షూటింగ్ ను ఎంజాయ్ చేస్తుంటే.. క్రిష్ సీరియస్ సీన్ చేస్తున్న సందర్భంలో.. ఈ పిల్లలాటలేంటిరా బాబోయ్ అని తలపట్టుకున్నాడట క్రిష్.

 

పిల్లల అల్లరి ముదరటంతో ఇక లాభం లేదనుకున్న క్రిష్... ఎలాగైనా లొకేషన్ లో సీరియస్ నెస్ క్రియేట్ చేసేందుకు శ్రియతో కరుకుగా ప్రవర్తించాడట దర్శకుడు క్రిష్. రిలీజ్ తర్వాత ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు క్రిష్. మొత్తంమీద శాతకర్ణి కథ షూటింగ్ సందర్భంగానే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నమాట శ్రియ,బాలయ్య, హేమ మాలినిలకు.

PREV
click me!

Recommended Stories

Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే