గణతంత్ర దినోత్సవంనాడు "కాటమరాయుడు" టీజర్

Published : Jan 13, 2017, 11:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
గణతంత్ర దినోత్సవంనాడు "కాటమరాయుడు" టీజర్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో 'కాటమరాయుడు' మార్చి 29న 'ఉగాది' కి విడుదల సంక్రాంతి కానుకగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. 

ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో వినూత్న రీతిలో చేసిన 'కాటమరాయుడు' ప్రచారం అభిమానుల్లో హుషారు పుట్టించింది. ఈ సందర్బంగా తెలుగు ప్రేక్షకులకి చిత్ర బృందం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. సంక్రాంతి కానుకగా మరికొన్ని ప్రచార చిత్రాలని విడుదల చేస్తున్నారు. చిత్రం మొదటి టీజర్ ని జనవరి 26న  విడుదల చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలిపారు.

సంక్రాంతి విరామం తరువాత, 16న మొదలయ్యే షూటింగ్, ఏకదాటిగా జరగబోయే షెడ్యూల్ తో చిత్రం పూర్తవుతుంది.  సినిమా 2017 మార్చి 29న 'ఉగాది' కి విడుదల కానుంది. 

 నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై  నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి  

 

నిర్మాత: శరత్ మరార్,  దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని, సంగీతం: అనూప్  రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, కళ: బ్రహ్మ కడలి. 

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు 

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?