ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్స్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ లీక్..

Published : Apr 09, 2023, 10:08 AM IST
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్స్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ లీక్..

సారాంశం

స్టార్ హీరో సినిమాలంటే.. షూటింగ్ దశలోనే లీకులు కామన్ అయిపోయాయి.. స్పెషల్ లుక్ కాని.. స్పెషల్ మీడియో కాని.. రిలీజ్ అయ్యేలోపు బయకు వచ్చేస్తుంటుంది. అది కొన్నిసినిమాలక ప్రమోషన్ గా ఉపయోగపడితే..కొన్ని సినిమాలకు మైనస్ అవుతోంది. 


స్టార్ హీరోల సినిమాలనుంచి లీకేజ్ లు కామన్ అయిపోయాయి ఈ మధ్య. కావాలని చేస్తున్నారు అంటూ విమర్షలు ఉన్నా.. లీకుల పర్వం మాత్రం ఆగడంలేదు. రీసెంట్ గా  రేపు రీలీజ్ అనగా.. రవితేజ రావణాసుర నుంచి నెగెటీవ్ డైలాగ్ ఒకటి లీక్ అయ్యి.. వైరల్ అయ్యింది. అది సినిమాకు ఏమాత్రం ఉపయోగపడకపోయినా.. రావణాసుర పై కాస్త  ఇంట్రెస్ట్ ను పెంచింది. కొంచెం కాంట్రవర్సీ కూడా అయ్యింది. ఇక ఇప్పుడు ఆ వంతు పవర్ స్టార్ సినిమాకు వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ మూవీ ఇలా స్టార్ట్ అయ్యిందో అలా లీకేజ్ స్టార్ట్ అయ్యింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రీసెంట్ గా  ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లోకి అడుగు పెట్టాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్ కు క్రేజ్ బాగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేసి కూడా మూడు నాలుగేళ్ళు అవుతోంది. పవర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో.. ఈసినిమా పెండింగ్ పడిపోయింది. ఇక ఈనెలలో సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు పవర్ స్టార్. 

పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేస్తే.. ఎలక్షన్ టైమ్ కు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఫిక్స్అయినట్టున్నాడు. అందులో భాగంగా.. ఉస్తాద్  భగత్ సింగ్ కు ఎక్కువ టైమ్ కేటాయించాడు. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది.  పవన్ ఈ సినిమాకి 20 రోజులకు పైనే కాల్ షీట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

 

ఈ ఫొటోలో పవన్ లైట్ గడ్డంతో లుంగీ కట్టుకుని డిఫెంట్ గా కనిపిస్తున్నాడు. షూటింగ్ నుంచి లుక్ బయటకు రావడంతో పవర్ స్టార్ అభిమానులు ఈ లుక్స్ చుసి పవన్ అభిమానులు దిల్ ఖుష్ అతవుతున్నారు. మా పవన్  మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టిఇంటే వైరల్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ను విషయంలో క్లారిటీ ఇ్వవలేదు.  శ్రీలీలను ఒక హీరోయిన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. ఈసినిమాకు దేశిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

ఈసినిమా తరువాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న హరిహరవీరమల్లు షూటింగ్ పై దృష్టి పెట్టనున్నాడు పవర్ స్టార్. ఈమూవీ పెండింగ్ షూట్ ను కంప్లీట్ చేయబోతున్నాడు. రీసెంట్ గా సముద్ర ఖని డైరెక్షన్ లో.. వినోదయ సీతం సినిమాషూటింగ్ ను కంప్లీట్ చేశాడు పవర్. ఈ షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఎలక్షన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు జనసేన అధినేత. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌