హరిహర వీరమల్లు కోసం ప్రధాని నరేంద్ర మోది, పవర్ కళ్యాణ్ పాన్ ఇండియా ప్లాన్ మామూలుగా లేదుగా

By Mahesh JujjuriFirst Published Oct 1, 2024, 5:58 PM IST
Highlights

నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. సినిమా ప్రమోషన్ కోసం ప్రధాని మోడీని కూడా రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్లు, పొలిటికల్ ప్రెజర్ వల్ల కొన్నిసినిమాలు పెండింగ్ పెట్టారు. ప్రభుత్వం ఫామ్ అయిన తరువాత డిప్యూటీ సీఎంగా కొన్ని బాధ్యతల వల్ల ఆ సినిమాల షూటింగ్స్ ఇంకాస్త ఆలస్యం అయ్యింది. అయితే అలా పెండింగ్ లో ఉన్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఓకటి ఉంది. ఆసినిమాను భారీ స్థాయిలో స్ట్రాట్ చేశారు. కాని దానికోసం ఎక్కుడ డేట్స్ కావల్సి వచ్చింది. అంతే కాదు రాజుల కాలంనాటి కథ కాబట్టి.. భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. 

పవన్ కళ్యాణ్ కు ఆ టైమ్ లేదు. ఆయన పొలిటికట్ గా ఇంకాస్త యాక్టీవ్ అయ్యే సరికి.. ఈసినిమా పెండింగ్ లో పడింది. దాదాపు 4 ఏళ్ళుగా ఈమూవీలో కథలిక లేదు. ఇక ఈసినిమాను కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈసినిమా కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారట పవన్. అక్టోబర్ వరకూ పవన్ కళ్యాన్ పోర్షన్ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. 

Latest Videos

అంతే కాదు ప్రమోషన్ ను కూడా భారీ స్థాయిలో చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయంలో నిర్మాత రత్నంతో పవన్ మాట్లాడారట. దేశ భక్తి సినిమా కావడంతో.. దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించాలని నిర్ణించారట. అందుకోసం అవసరం అయితే ప్రధాని నరేంద్ర మోదీని కూడా రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట పవన్. సినిమా రిలీజ్ కు ముందు మోదీకి, అమిషాకు ఈసినిమా చూపించి.. వారి చేత సినిమాపై అభిప్రాయం చెప్పించాలని పవన్ ప్లాన్ చేశారట. 

ఇక నరేంద్ర మోడీ ఈసినిమా చూసి.. హరిహరవీరమల్లు గురించి మాట్లాడితే.. నార్త్ లో సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతే కాదు పవన్ స్టార్ డమ్ కు మోదీ కూడా తోడైతే.. హరిహరవీరమల్లుకు తిరుగు ఉండదని చెప్పాలి. ఈ రకంగా చూసుకుంటే ఇది పెద్ద ప్లానే.

గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 

హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. ఈసినిమాతో పాటు మరికొన్నిసినిమాలు కూడా పెడ్డింగ్ పెట్టిన పవన్.. కొన్ని సినిమాలను ఎలక్షన్స్ కు ముందు కంప్లీట్ చేశాడు. అయితే ఆతరువాత ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ చేసిన ప్రకటతో ఎన్నికల హీటో ముందే స్టార్ట్ అయ్యింది. తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి అని పవన్ ప్రకటనతో.. ఆయనకు తీరిక లేకుండా పోయింది. 

ఆతరువాత నుంచి పొత్తులు,  ప్రచారాలు, ఎలక్షన్లు హడావిడి, పాన్టీ కార్యక్రమాలు ఇలా పవన్ ఏమాత్రం ఖాళీ లేకుండా బిజీ అయిపోయారు. అన్ని సినిమాలు ఏమో కాని.. ఈసినిమా మాత్రం హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో.. ఈమూవీ కోసం చాలా కష్టపడాలి. ఎక్కువ టైమ్ కేటాయించాలి. దీని కోసం ఇప్పటికే కర్రసాము లాంటివి ప్రక్టీస్ చేశాడు పవన్. 

ఇవన్నీ ఎలక్షన్ టైమ్ లో కదరకపోవడంతో.. షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి.. ఎన్నికల తరువాత చూద్దాం అని అలా వదిలేశారు. ఇక ఎన్నికల్లు పవన్ కళ్యాణ్ కూటమి గెలవడంతో.. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో ప్రభుత్వం మీద పట్టు కోసం.. కొన్నాళ్లు తన శాఖలపై పనిచేసి.. ఓ దారిలోపెట్టుకున్న పవన్.. ఇక తన పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టాడు. కొత్త సినిమాలు చేస్తారో లేదో క్లారిటీ లేదు కాని.. పెండింగ్ లో ఉన్న సినిమాలు మాత్రం కంప్లీట్ చేడానికి రెడీ అయ్యారు. 

పవర్ స్టార్  కోసం భారీ సెట్టింగులు 

ఇక హరిహర వీరమల్లు యుద్దువీరుల కథ. దాని కోసం ఎంతో శ్రమించి ఏడాదిన్నర క్రితం వరకూ కూడా కొన్నసెట్లు వేశారు. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు, అల్యూమినియంఫ్యాక్టరీ దగ్గర కూడా ఈసినిమా కోసం కోట్లు ఖర్చు చేసి సెట్లు వేసినట్టు తెలుస్తోంది.  అయితే పవన్ కళ్యాణ్ షూటింగ్ కుగ్యాప్ ఇచ్చి .. పొలిటికల్ రూట్ చూసుకోవడంతో.. ఈసెట్లు అన్నిపాడైపోయాయట. ఎంతో కష్టపడి వేసిన సెట్లు అన్నీ ఇలా వృదా అయ్యాయి. 

ఇక తాజాగా హరి హర వీరమల్లు కోసం మరికొన్ని సెట్లు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా పవన్ కు అనుకూలంగా ఉండే విధంగా అమరావతిలో వేశారట. డిప్యూటీ సీఎంగా ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. దాంతో హైదరాబాద్ కు అస్తమానం వచ్చి వెళ్ళడం కుదరదు కాబట్టి.. పవన్ కళ్యాణ్ షూటింగ్స్ అన్నీ అమరావతిలోనే సెట్ చేసినట్టుసమాచారం. ఇక రోజులో కంత సమంయం షూటింగ్ కు కేటాయించబోతున్నార పవన్ స్టార్. 

హరిహర వీరమల్లు నుంచి తప్పుకున్న క్రిష్

ఇక ఈసినిమా మొదలయ్యి నాలుగేళ్ళు అవుతుంది. అంతే కాదు ఎన్నో ఇబ్బందులు కూడా ఈసినిమా వన్న ఫేస్ చేశారు ప్రొడ్యూసర్స్. కొంత వరకూ షూటింగ్ జరిపిన ఈమూవీ ఇక పట్టాలెక్కదు అంటూ చాలామంది అనుకున్నారు. ఇంత గ్యాప్ వచ్చిన తరువాత మళ్ళీ ఆర్టిస్ట్ ల డేట్స్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఒకేసారి వాళ్ళు దొరక్కపోతే ఎలా అని అంతా ఆలోచనలో పడ్డారు. 

ఈమధ్యలోనే ఈసినిమాను మొదటి నుంచి డైరెక్ట్ చేస్తూ వచ్చిన క్రిష్ ఈసినిమా నుంచి తప్పకున్నాడు. గతంలోనే వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అన్న టాక్ విపినించింది. ఇక తాజాగా క్రిష్ ఈసినిమా నుంచి తప్పుకోవడంతో.. ఆ విషయంలో క్లారిటీ కూడా వచ్చేసింది. 

ఇక ఈసినిమా నుంచి క్రిష్ తప్పకున్న తరువాత దర్శకత్వ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ జ్యోతీ కృష్ణ తీసుకున్నారు. ప్రస్తుతం ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నంది అతనే. త్వరగా షూటింగ్ ను కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది మార్చ్ చివరి వారంలో ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంుటన్నారు మేకర్స్. 

పవన్ కోసం హరీష్ శంకర్ వెయిటింగ్..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఈసినిమా మాత్రమే కాదు. మరో రెండు సినిమాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. అందులోసుజిత్ డైరెక్షన్ లో ఓజి మూవీతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉన్నాయి. హరిహరవీరమల్లు. ఉస్తాద్ భగత్ సింగ్ ఈరెండు సినిమాలు దాదపు ఒకే సారి స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు. 

గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాను పవన్ కోసం ఇచ్చిన హరీష్.. ఉస్తాద్ కోసం మూడునాలుగేళ్ళుగా కళ్ళు కాయలు కాచేలా ఎదరు చూస్తున్నాడు. ఇక ఈసినిమాకు కూడా త్వరలో డేట్స్ ఇవ్వబోతున్నాడ పవన్ కళ్యాణ్.

click me!