మెగాస్టార్ కు పవర్ స్టార్ బర్త్ డే విషెస్.. అన్నయ్యపై ప్రేమను కురిపించిన తమ్ముడు.. ఎమోషనల్ నోట్..

By team teluguFirst Published Aug 22, 2022, 1:33 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ బెస్ట్ విషెస్ తెలిపారు. సుధీర్ఘమైన ఎమోషనల్ నోట్ తో  అన్నయ్యపై ఉన్న ప్రేమను తెలియజేశాడు. 
 

టాలీవుడ్ సీనియర్ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) పుట్టిన రోజు వేడుకలను ఈ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, ఇటు సినీతారలు, రాజకీయం పరంగా ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున్న శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బర్త్ డే విషెస్ తెలపగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో అన్నయ్య చిరుపై ఎప్పుడూ చూపించని ప్రేమను కురిపించారు. ఈ సందర్భంగా సుధీర్ఘమైన భావోద్వేగమైన ప్రకటనతో అన్నయ్య అంటే ఎంత అభిమానమో మరోమారు తెలియజేశాడు.

చిరంజీవి తన 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న  సందర్భంగా ట్విట్టర్‌  ద్వారా పవన్ కళ్యాణ్  శుభాకాంక్షలు తెలిపారు.  ‘నేను ప్రేమించే, గౌరవించే మరియు ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం మరియు కీర్తిని కోరుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే తన స్థాపించిన రాజకీయపార్టీ జనసేన పార్టీ తరుపున మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో చాలా భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు. 

‘అన్నయ్య’.. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవిని పిలవడమే కారణమేమో.. ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం, ఆయన సాధించిన విజయాలు.. సినిమా రికార్డులు, అధిరోహించిన పదవులు, కీర్తిప్రతిష్ఠలు, సేవాతత్పరత తెలుగు వారందరితోపాటు యావత్ భారత దేశమంతటికీ సర్వ విధితమే. వేలమందిని ఆపద సమయాల్లో ఆదుకున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనా లేదా చదువులకు దూరమైన  వెంటనే స్పందించి సాయం చేసిన సహృదయుడు అన్నయ్య. ఇన్ని సుగుణాలున్న అన్నయ్య కు తమ్ముణ్ణి కావడం సుకృతం. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంకుంటున్నాను’. అంటూ పవన్ తన మనస్సులోని మాటల్ని వ్యక్త పరిచారు. ప్రస్తుతం పవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.  

 

My Wholehearted Birthday wishes to my Beloved Brother whom I love ,respect & adore..
Wishing you Good Health,Success & Glory on this special day.

— Pawan Kalyan (@PawanKalyan)

 

మనసున్న మారాజు అన్నయ్య శ్రీ గారు - JanaSena Chief Shri pic.twitter.com/WV7KXxXuKV

— JanaSena Party (@JanaSenaParty)
click me!