రంగంలోకి దిగిన రజనీకాంత్, సెట్స్ పైకి జైలర్ మూవీ షూటింగ్.

Published : Aug 22, 2022, 12:41 PM IST
రంగంలోకి దిగిన రజనీకాంత్, సెట్స్ పైకి  జైలర్ మూవీ షూటింగ్.

సారాంశం

చాలా కాలం గ్యాప్ తరువాత రంంలోకి దిగాడు.. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్. కొత్త సినిమా  షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కరోనాతో పాటు, అనారోగ్య సమస్యలు, కూతురు విడాకుల హడావిడిలో ఉన్న రజనీ కాంత్. ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చారు. 

 ఈమధ్య ఎక్కువగా యంగ్ డైరెక్టర్ స్ తోనే సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అది కూడా కొత్త  దర్శకులకు ఎక్కువగా అవకాశాలనిస్తూ వెళుతున్నారు. కబాలి నుంచి ఆయన ఇదే ఫార్ములా ఉపయోగిస్తున్నారు. ఆ సినిమా సక్సెస్ అయినా.. లేకున్నా సరే.. తలైవా మాత్రం తన పందాను మార్చుకోవడం లేదు. యంగ్ డైరెక్ర్స్ తోనే ఎక్కువగా కలిసి పనిచేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ లిస్ట్ లో పా.రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్, శివతో  పాటు మరికొంత మంది యంగ్ స్టార్స్ ఉన్నారు. 

అయితే ఇక్కడ విశేషం ఏంటీ అంటే.. రజనీకాంత్ సక్సెస్.. ఫెయిల్యూర్ అనేది చూడకండా కొత్త దర్శకులు.. అందులోను యువదర్శకులతో సినిమాలు చేస్తూవస్తున్నారు... దానికి కారణం రజనీని వాళ్ళు సరికొత్తగా చూపించడమే. అలా సూపర్ స్టార్ ను సరికొత్తగా చూపించడంలో ఆ డైరెక్టర్లు సక్సెస్ అయ్యారు. అవుతూనే ఉన్నారు. రజనీకాంత్ కెరీర్ లోఇంత వరకూ చేయని పాత్రలను వాళ్లు చేయిస్తున్నారు..కొత్తదనం చూపిస్తున్నారు. 

ఇక తాజాగా  రజనీ కాంత్  నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో  చేస్తున్న  జైలర్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. నెల్సన్ దిలీప్ తయారు చేసుకునే కథలు ..ఆయన స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలను తక్కువ బడ్జెట్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ఇదే విషయాన్ని బీస్ట్ సినిమాతో ఆయన  నిరూపించారు. అందువల్లనే సన్ పిక్చర్స్ వారు ఆయనకి మరో ఛాన్స్ ఇచ్చారు.

ఇప్పటికే జైలర్  టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రజనీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. డిఫరెంట్ లుక్ తో చాలా సీరియస్ గా రజనీ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.  ఈ సినిమాలో కథ అంతా కూడా జైలు చుట్టూ తిరుగుతుందట. ఇక జైలర్ గా రజనీ కాంత్ ఎలా కనిపించబోతున్నారు చూడాలి. ఫ్యాన్స్ కూడా సూపర్ స్టార్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ మాధిరిగా సాలిడ్ హిట్ పడితే బాగుండి అని ఎదురు చూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్