Ram Charan: రామ్ చరణ్ తో సీక్వెల్ చేయమని చిరు ప్రపోజల్

By Surya Prakash  |  First Published Aug 22, 2022, 1:20 PM IST

కార్తికేయ సీక్వెల్ మంచి హిట్ అవటంతో ...ప్రతీ హీరో తమ సూపర్ హిట్ సినిమాలు సీక్వెల్స్ చేయాలనే ఉత్సాహం మొదలైంది. అలా ఇప్పుుడు చిరంజీవి కూడా  ఓ సినిమా సీక్వెల్ పై కన్నేసారట. అయితే అది ఆయన చేసిన సినిమా కాదు.



'తని ఒరువన్’ టైటిల్ తో తమిళంలో వచ్చి ఘన విజయం సాధించిన చిత్రాన్ని ధృవ టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసారు...అదీ రామ్ చరణ్ లాంటి మెగా హీరోతో, దానికి తోడు విలన్ పాత్రకే ప్రాధాన్యత ఉన్న చిత్రం ఇది. దాన్ని తెలివిగా తెలుగుకు మార్చుకోవాలి లేకపోతే ఫ్యాన్స్ హర్టవుతారు..ఫలితం తారుమారుపుతుంది. ఆ మెగా ఛాలెంజ్ లో సురేంద్ర రెడ్డి సక్సెస్  అయ్యారు. ఇప్పుడా సినిమా సీక్వెల్ చేయాలని దర్శకుడు స్క్రిప్టుతో రెడీగా ఉన్నారు. ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి తన కుమారుడుతోనే ఆ సినిమా ప్రపోజల్ పెట్టారని ఫిల్మ్ నగర్ తాజా ఖబర్. అదే దర్శకుడు ఇప్పుడు చిరంజీవితో గాడ్ ఫాదర్ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత మెగా కాంపౌండ్ లోనే మరో సినిమా చేసే ప్లాన్ లో మోహన్ రాజా ఉన్నట్లు సమాచారం.
 
  నిజానికి తన బ్లాక్ బస్టర్ `ధృవ` సీక్వెల్లో నటించేయాలన్న ఆలోచన చరణ్ కి ఉంది. కానీ అలాంటి థ్రిల్లర్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఇబ్బంది పెట్టేస్తాయి.తెలుగులో ధృవ ఆడింది కానీ తమిళంలో వచ్చినంత అప్లాజ్ అయితే రాలేదు. అదే రామ్ చరణ్ ని ఈ సినిమా సీక్వెల్ చేయాలా వద్దా అనే డైలామోలోకి తోసేసిందని సమాచారం.

ధృవ  సినిమాలో కథ కంటే స్క్రీన్ ప్లేకే పెద్దపీట. ‘నీ శత్రువుని చూసి నీ కెపాసిటీ ఏంటో అంచనా వేయొచ్చు' అనే సూత్రాన్ని నమ్మిన ఓ యువ ఐపీఎస్‌ అధికారి, బలమైన శత్రువుని ఎంచుకొని అతని ఆట కట్టించడమే ఈ సినిమా కథ. బలమైన శత్రువుని ఎదుర్కొనే క్రమమే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక సాదాసీదా కథకి, శక్తిమంతమైన స్క్రీన్ ప్లే ని జోడించారు. దీంతో ప్రతి సీన్ ఎత్తులు పైఎత్తులతో సాగి థ్రిల్స్ కలిగిస్తుంది. అంతకు మించి ఈ సీక్వెల్ ఉండాలని ఆశించటం లో తప్పు లేదు.
 
అందులోనూ  ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ రిలీజయ్యాక రామ్ చరణ్  మార్కెట్ రేంజ్ మారింది.ఆర్ ఆర్ ఆర్  మూవీ రిజల్ట్ అతని తదుపరి ప్రాజెక్టులపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు శంకర్ తో చేస్తున్న సినిమా కూడా ప్యాన్ ఇండియానే.  అందుకే సాటి హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటవుతున్నా చరణ్ మాత్రం ఏదీ ఫైనల్ చేయడం లేదట. కథలు విన్నా చాలా నచ్చలేదని రిజెక్ట్ చేసి పంపారట. రామ్ చరణ్  అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే ఒక ప్రాజెక్ట్ ను చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నారట.  ధృవ 2 ని కూడా  చేయాలన్న ఆలోచనతో చరణ్ ఉన్నాడన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే గాడ్ ఫాదర్ హిట్టయితేనే ఈ సీక్వెల్ ఉంటుంది.

Latest Videos

click me!