షాక్ లో మహేష్ ఫ్యాన్స్.. 'మహర్షి' ఇప్పట్లో రాదట!

Published : Feb 22, 2019, 12:41 PM IST
షాక్ లో మహేష్ ఫ్యాన్స్.. 'మహర్షి' ఇప్పట్లో రాదట!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'మహర్షి'. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'మహర్షి'. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు చెప్పారు.

ఏప్రిల్ 25న సినిమా వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ సమయానికి కూడా సినిమా వచ్చేలా లేదు. సమ్మర్ లో అసలు 'మహర్షి' రిలీజ్ ఉండదని టాక్. దీంతో మహేష్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమ్మర్ సీజన్ ని వదిలేసి ఇప్పుడు జూన్ కి సినిమాను వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కావాల్సి ఉండడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఇంకా కొంతభాగం టాకీ పార్ట్ అలానే రెండు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది.

త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. పూజా హెగ్డే, అల్లరి నరేష్, రావు రమేష్, జగపతిబాబు వంటి తారలు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజుతో పాటు అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌