రూ.35 లక్షలు చెల్లించిన మహేష్ బాబు!

Published : Feb 22, 2019, 10:25 AM IST
రూ.35 లక్షలు చెల్లించిన మహేష్ బాబు!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ సినిమాస్ రూ.35.66 లక్షల వస్తు, సేవల పన్నుని గురువారం నాడు చెల్లించింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ సినిమాస్ రూ.35.66 లక్షల వస్తు, సేవల పన్నుని గురువారం నాడు చెల్లించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ లపై జనవరి 1 నుండి తగ్గించిన పన్ను రేట్లను తగ్గించకుండా పాత పన్నురేట్లతోనే విక్రయిస్తున్నారని కేంద్ర జీఎస్టీ అధికారులు జరిపిన దాడులలో తేలింది.

దీంతో అధికారులు కేసులు నమోదు చేశారు. జనవరి 1 నుండి ఈ నెల 5వరకు ఎక్కువ మొత్తం వసూలు చేసినట్లు నిర్ధారించారు. అలా వసూలు చేసిన పన్ను మొత్తం రూ.35.66 లక్షలుగా పేర్కొనగా.. ఆ మొత్తాన్ని ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం చెల్లించింది. జీఎస్టీ అధికారులు ఈ మొత్తాన్ని చట్టప్రకారం వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయనున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్