కోరిక తీర్చమని ఒత్తిడి తెచ్చారు.. అమ్మని కూడా వదలలేదు.. హీరోయిన్ కామెంట్స్!

By Udaya DFirst Published 22, Feb 2019, 11:11 AM IST
Highlights

సినిమా ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను మీడియా ముఖంగా వెల్లడించారు. 

సినిమా ఇండస్ట్రీలో లైంగిక ఆరోపణలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను మీడియా ముఖంగా వెల్లడించారు. తాజాగా మరోనటి తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియా ముందు బయటపెట్టింది. 

లైంగిక వేధింపుల కారణంగా ఆమె నటనకు దూరమవుతున్నాననిచెప్పడం అందరినీ షాక్ కి గురి చేసింది. మలయాళీ నటి కణి కుసృతి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. 'కాక్ టెయిల్', 'షికార్' వంటి చిత్రాల్లో తన నటనతో జనాలను మెప్పించింది.

తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. మంచి నటిగా రాణిస్తున్న సమయంలో సడెన్ గా నటనకి దూరమైంది. దానికి కారణం ఏంటని ఇటీవల ఆమెని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. షాకింగ్ నిజాలు వెల్లడించింది. ఓ చిత్ర దర్శకనిర్మాతలు తమను శారీరకంగా సుఖపెడితేనే సినిమాలో ఆఫర్ ఇస్తామని అడిగారట. 

తన తల్లిపై కూడా ఒత్తిడి తెచ్చారట. కానీ దానికి కణి కుసృతి అంగీకరించకపోవడంతోఆమె అవకాశాలు రాలేదని, జీవితం గడిచే పరిస్థితి లేకపోవడం వలన నటనని వదులుకున్నట్లు వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఊపందుకోవడం మంచి విషయమని దీని కారణంగా కొందరికైనా.. మేలు జరుగుతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 

Last Updated 22, Feb 2019, 11:11 AM IST